New Delhi, March 17: కరోనావైరస్ మహమ్మారి (Coronavirus Pandemic) వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా సుదూర ప్రాంతాలకు వెళ్లే 23 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ రైల్వే (Central Railways) శాఖ ప్రకటించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనావైరస్ ప్రతాపం చూపుతున్న నేపథ్యంలో ముంబై సహ, మహారాష్ట్రలోని ఇతర ముఖ్య పట్టణాలను కలుపుతూ పోయే రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఇందులో భాగంగా ముంబై- నిజామాబాద్- కరీంనగర్ మధ్య నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్, ముంబై- దిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, ముంబై-పుణె దక్కన్ ఎక్స్‌ప్రెస్, ముంబై-నాగ్‌పూర్ నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ సహా 23 సర్వీసులను మార్చి 31 వరకు రద్దు చేస్తూ, అలా రద్దు కాబడిన రైళ్ల జాబితాను మధ్య రైల్వే విడుదల చేసింది.
ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకకుండా "సామాజిక దూరం" పాటించేలా చేయడానికి ఈ చర్య తీసుకోబడినట్లు అధికారులు పేర్కొన్నారు.
అంతేకాకుండా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఏసి కోచ్‌లలో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వబోమని సెంట్రల్, వెస్ట్రన్, సదరన్ రైల్వేలు ఇప్పటికే ప్రకటించేశాయి. ఎవరి దుప్పట్లు వారే వెంట తెచ్చుకోవాల్సిందిగా కోరింది. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని ప్రభుత్వం కూడా సూచించింది.
Check List of Trains Cancelled by Central Railway
దేశంలో అత్యధికంగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. మంగళవారం సాయంత్రం నాటికి మహారాష్ట్రలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 40కు చేరగా, ఒకరు మరణించారు. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనాకేసులు 126కు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేశాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.
మరోవైపు, కరోనా భయంతో చాలా చోట్ల ప్రజలు స్వచ్ఛందంగానే రైలు ప్రయాణాలు మానుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు లేకపోవడంతో కూడా కొన్ని రైళ్లు రద్దు అయ్యాయి.
List of Train Services Cancelled Due to Low Occupancy:
Western Railway: 35 trips of 10 trains have been cancelled due to low occupancy in view of COVID19. #Coronavirus pic.twitter.com/xU49LA9iet
— ANI (@ANI) March 17, 2020
రైల్వే స్టేషన్లలో రద్దీని నివారించడానికి సెంట్రల్ రైల్వే మరియు వెస్ట్రన్ రైల్వేస్ పరిధిలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను రూ .10 నుండి రూ .50 కు పెంచారు. ముంబై, పుణె, భూసవల్, నాగ్‌పూర్, సోలాపూర్ డివిజన్లలోని అన్ని ప్రధాన స్టేషన్లలో మంగళవారం నుంచే ఈ ధరల పెరుగుదల అమలవుతుందని తెలిపారు. స్టేషన్ పరిమాణాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చునని కేంద్ర రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు.
ముంబైలో లోకల్ ట్రైన్ సర్వీసులను కూడా కొంతకాలం పాటు రద్దు చేయాలని సీఎం ఉద్ధవ్ థాకరే సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.