Mumbai, Mar 17: కరోనా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చుతోంది. ఇండియాలో (India) ఇది మరింత ఆందోళనను రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే (IRCTC) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రైల్వే స్టేషన్లలో జనాభా ఉండకుండా ఉండేందుకు ఫ్లాట్ ఫాం ధరలను పెంచింది.
కరోనా ఎఫెక్ట్‌తో ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం
సాధారణంగా పండుగల సమయంలో రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను (Railway platform ticket) రైల్వే శాఖ పెంచుతుంది. తాజాగా కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి నివారణకు రూ.10 ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను 50 రూపాయలకు పెంచుతున్నట్లు (Railway Platform Ticket Price Hike) ప్రకటించింది. మొత్తం 250 రైల్వే స్టేషన్లలో టికెట్ల ధర పెంపు వర్తిస్తుందని పేర్కొంది.
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ (Indian Railways) తెలిపింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్లాట్‌ఫామ్‌పై రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ముంబై లోకల్ రైల్వే స్టేషన్లను చాలా చోట్ల మూసి వేస్తున్నట్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రూ.4 లక్షలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కేంద్రం, కరోనా పేషంట్లకు ఆస్పత్రి ఖర్చులు కూడా చెల్లించదు
కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య భారత్‌లో మూడుకు చేరింది. తాజాగా ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కస్తూర్బా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇప్పటివరకు ఢిల్లీలో ఒకరు, కర్ణాటకలో మరొకరు మృతి చెందారు. ముంబైలో ఈ వ్యక్తి మృతితో ఈ సంఖ్య మూడుకు చేరింది. అయితే ఈ వ్యక్తి మరణంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
భారత్‌లో మూడో కరోనావైరస్ మరణం నమోదు
కరోనాతానే సదరు బాధితుడు మరణించినట్లు ఓ వైపు జోరుగా ప్రచారం జరుగుతుండగా, మరోవైపు ప్రభుత్వం మాత్రం దీన్నీ ధ్రువీకరించడంలేదు. మరణించిన వ్యక్తి కరోనాతోనే చనిపోయాడా? లేక వేరే కారణంతో మృతిచెందాడా? అనేది ఇంకా తెలియాల్సి ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ టోపే వెల్లడించారు. సదరు వ్యక్తి మృతికి సంబంధించిన రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు.
కాగా, ఈ మరణంతో దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే.