Measles Outbreak in Mumbai: కరోనా తర్వాత ముంబైని వణికిస్తున్న తట్టు వ్యాధి, ఏడాది వయసున్న చిన్నారి మృతితో 11కు చేరిన మరణాల సంఖ్య, 220కు చేరుకున్న మొత్తం కేసులు
Representational image (photo credit- Wikimedia commons)

Mumbai, Nov 23: దేశ ఆర్థిక రాజధాని,మహారాష్ట్ర రాజధాని ముంబైలో తట్టు వ్యాధి కేసులు (Measles Outbreak in Mumbai) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే మహానగరంలో 20 మంది తట్టు (Measles ) బారినపడ్డారని బృహిన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) తెలిపింది. తాజాగా ఈ వ్యాధి వల్ల ఏడాది వయస్సు ఉన్న చిన్నారి మరణించిందని (One more child dies) బీఎంసీ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఈ ఏడాదిలో పదకొండు మంది తట్టు వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. జనవరి 1 నుంచి 220 కేసులు (case tally at 220) నమోదయ్యాయని పేర్కొన్నది.

ముంబైలో మీజిల్స్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తొమ్మిది నెలల నుంచి ఐదేండ్ల వయస్సు ఉన్న తమ చిన్నారులకు వెంటనే టీకాలు వేయించాలని బీఎంసీ కోరింది. కాగా, మీజిల్స్‌ చికిత్స కోసం అంధేరిలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించింది.

వైరల్ వీడియో, పుల్లుగా మందు తాగి క్లాస్ రూంలోనే చొక్కా విప్పి హాయిగా నిద్ర పోయిన హెడ్ మాస్టర్, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్

ఈ వ్యాధి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఒళ్లంత దద్దుర్లు, తీవ్రమైన జ్వరం దీని లక్షణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. విరేచనాలు, న్యుమోనియా కూడా కొందరిలో ఉంటుంది.. ఇవన్నీ కలగలిసి వ్యాధి ముదిరి మరణానికి కారణమవుతాయి. రోగ నిరోధకత స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇది వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.కాగా 1963లోనే తట్టుకు వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షా 40 వేల మంది దీని బారీన పడి ప్రాణాలను వదులుతున్నారు.