Mumbai Rains: ముంబై నగరాన్ని ఒక్కసారిగా ముంచెత్తిన భారీ వర్షం, హోర్డింగ్ కూలి ముగ్గురు మృతి, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన షిండే, వీడియోలు ఇవిగో..

ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వర్షం కారణంగా 15 విమానాలను దారి మళ్లించారు.

Mumbai Rains: ముంబై నగరాన్ని ఒక్కసారిగా ముంచెత్తిన భారీ వర్షం, హోర్డింగ్ కూలి ముగ్గురు మృతి, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన షిండే, వీడియోలు ఇవిగో..
Three dead, 59 injured as hoarding collapses in Ghatkopar Maharashtra CM Eknath Shinde Announces Ex-Gratia of Rs 5 Lakhs to Family of Deceased

ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వర్షం కారణంగా 15 విమానాలను దారి మళ్లించారు. ఘాట్‌కోపర్‌లోని చెద్దానగర్ జంక్షన్‌లో వంద అడుగుల బిల్ బోర్డు కూలిపోయి సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌పై పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 67 మంది వరకు గాయపడ్డారు.

బిల్ బోర్డు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగాయి. పాల్ఘర్, థానే జిల్లాల్లో రానున్న మూడునాలుగు గంటల్లో.. 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరించింది. భారీ గాలులు, వర్షాల కారణంగా ఆరే – అంధేరీ ఈస్ట్ మెట్రోస్టేషన్ల మధ్య రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముంబైలోని పెట్రోలు పంపు పక్కన ఉన్న ఓ టవర్ హోర్డింగ్ కారణంగా మరణించిన వారి బంధువులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 13, 2024 09:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).