ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను నేడు ప్రారంభించారు. ఈ క్రూయిజ్ వారణాసి నుంచి 3,200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. అస్సాంలోని దిబ్రూగర్ వద్ద ఈ క్రూయిజ్ తొలి పర్యటన ముగియనుంది. తొలి బ్యాచ్ లో 52 మంది స్విస్ టూరిస్టులు పాల్గొంటున్నారు. మొత్తం 51 రోజుల ప్రయాణానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక ప్రయాణికుడికి ఒక రోజుకు రూ. 25,000- 50,000 ఖర్చు కానుంది.ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. ఇందులో భాగంగానే వారణాసిలో టెంట్ సిటీకి మోదీ శ్రీకారం చుట్టారు. గంగ ఘాట్ వద్ద 200 టెంట్ల ఏర్పాటుతో పాటు రూ.1000 కోట్ల ఖర్చుతో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్‌ను ప్రారంభించారు.
Here's MV Ganga Vilas cruise
Watch | PM @narendramodi flags off MV Ganga Vilas cruise.@shipmin_india@CMOfficeUP@tourismgoi pic.twitter.com/tPQGvknQOY
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) January 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)