యువత కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మేరా యువ భారత్/మై భారత్ పేరుతో ఓ స్వయంప్రతిపత్తి కలిగిన వేదికను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా యువత నైపుణ్యాభివృద్ధి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో పంచుకున్నారు.

యువత నైపుణ్యాభివృద్ధికి ఒక డిజిటల్ వేదికను తీసుకురావడమే మేరా యువ భారత్ లక్ష్యమని తెలిపారు. యువత తమకు కావాల్సిన అవకాశాలను పొందడంతో పాటు సుసంపన్న భారత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి, పౌరులకు మధ్య వారధులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ వేదిక ద్వారా 15 నుంచి 29 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ప్రయోజనం ఉంటుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 31న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)