Nashik/Mumbai, April 21: కరోనా కల్లోలం రేపుతున్న వేళ మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకున్నది. నాసిక్‌లోని డాక్టర్ జకీర్ హుస్సేన్ హాస్పిటల్ (Zakir Hussain Municipal Hospital) వద్ద ఆక్సిజన్ ట్యాంకర్ లీకైన ఘటనలో (Nashik Oxygen Tanker Leak) 22 మంది రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి సిలిండర్లలో ఆక్సిజన్ నింపుతున్న సమయంలో ప్రమాదం (Oxygen Tanker Leak) జరిగింది.
ఘటనా స్థలం వద్ద ఉన్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లీకవుతున్న ఆక్సిజన్‌ను అదుపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో క్రిటికల్ పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం వస్తున్నది.
లీకేజీ ఘటనతో సుమారు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. బాధితులంతా వెంటిలేటర్లపై ఆధారపడి ఉన్నారు. వాళ్లకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉంటుంది. సుమారు 150 మంది రోగులు ఆక్సిజన్‌పై ఆధారపడి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై శీఘ్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు మంత్రి రాజేశ్ తోప్ తెలిపారు.
నాసిక్ జిల్లా కలెక్టర్ సూరజ్ మంధరే తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన నేపథ్యంలో 22 మంది మరణించారు, వీరంతా కోవిడ్-19 వ్యాధిగ్రస్థులే. ఆక్సిజన్ లీక్ అయిన తర్వాత ఆసుపత్రిలో రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వీరు ప్రాణాలు కోల్పోయారు.
Here's ANI Update
#WATCH | An Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Officials are present at the spot, operation to contain the leak is underway. Details awaited. pic.twitter.com/zsxnJscmBp
— ANI (@ANI) April 21, 2021
ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని డాక్టర్ షింగనే తెలిపారు. దీనిపై సవివరమైన నివేదికను తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ దారుణానికి బాధ్యులైనవారిని వదిలిపెట్టేది లేదన్నారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆ దుర్ఘటన గుండెను పిండేసే అంతటి విషాదకర ఘటన అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర మనోవేదన కలిగించిందని ట్వీట్ చేశారు. ఇలాంటి విషాద ఘడియలో మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని తెలిపారు.22 మంది రోగులు మృతిచెందిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
నాసిన్ ఘటన దురదృష్టకరమని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ టోపే అన్నారు. పరిస్థితిపై నాసిక్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడానని, ప్రస్తుతానికి అంతా అదుపులోనే ఉందని ఆయన పేర్కొన్నారు. తాను నాసిక్ బయల్దేరి వెళ్తున్నట్లు తెలిపారు. స్థానిక మంత్రి చాగన్ భుజ్‌బల్ ఇప్పటికే ఘటనాస్థలానికి చేరుకున్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి రాజేశ్ టోపే చెప్పారు.