Naxal Attack in Bijapur (Photo-ANI)

Dantewada, January 6: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి పేల్చివేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.ఐఈడీ పేలిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను బీజాపూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఛ‌త్తీస్‌గఢ్‌లో జ‌వాన్ల వాహ‌నంపై పేలుళ్ల‌తో విరుచుకుపడిన మావోయిస్టులు, 8 మంది జవాన్లతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి, పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు

మొత్తం పదిహేను మంది జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని అంబోలి వంతెన వద్ద సోమవారం(జనవరి6) మావోయిస్టులు పేల్చివేశారు. వాహనం కుత్రు అటవీప్రాంతంలోని ఓ మార్గం వద్దకు రాగానే.. మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. పోలీసువాహనం తుక్కుతుక్కైంది. దంతెవాడ, నారాయణ్‌పుర్‌, బీజాపూర్‌ సరిహద్దుల్లో పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించి.. తిరిగి వెళ్తుండగా దారిలో మావోయిస్టులు ఐఈడీని పేల్చారు.

8 Jawans, Driver Killed As Maoists Blow Up Security Vehicle in Chhattisgarh

ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, సుక్మా జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతోంది. దీంతో ఇక్కడ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఏకంగా భద్రతా బలగాల వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చివేయడం సంచలనంగా మారింది. కాగా, ఆదివారమే ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులతో పాటు ఒక జవాను మృతి చెందారు. ఈ నేపథ్యంలో సోమవారం భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.