Mumbai, June 10: మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ముంబై ఇప్పటికూ చైనా వూహాన్ సంఖ్యను దాటిపోయింది. ముంబైలో అంతకంతకూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా థానే మున్సిపల్ కార్పొరేషన్‌లో (Thane Municipal Corporation (TMC)) కరోనా వైరస్ సోకి NCPకి చెందిన కార్పొరేటర్ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్న కార్పొరేటర్ ముకుంద్ కేని (NCP Mukund Keni) (58) మంగళవారం రాత్రి మరణించారు. పుట్టినరోజే కరోనాతో ఎమ్మెల్యే మృతి, కోవిడ్-19 కేసుల్లో వూహాన్ నగరాన్ని మించిపోయిన ముంబై, దేశ వ్యాప్తంగా 2 లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు
ముకుంద్ కేనీకి 14 రోజుల క్రితం కొవిడ్ -19 పాజిటివ్ అని తేలడంతో.. థానేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. కరోనా రోగులకు సేవలు అందిస్తూ ఆయన మహమ్మారి బారినపడ్డారని ముకుంద్ కేని సన్నిహితులు చెప్పారు. ముకుంద్ కేనీని థానే ఆస్పత్రికి తరలించాక పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ రావడంతో అక్కడి నుంచి ముంబైలోని ఆస్పత్రికి మార్చారు. ఆయనకు డయాబెటిస్ సమస్య కూడా ఉండటంతో వెంటిలేటర్ ఏర్పాటు చేశారు. చికిత్స పొందుతూనే ముకుంద్ మరణించారు. కాగా, యాన భార్య ప్రమీలా కేని థానే మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు.
ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణతో దేశ అర్థిక రాజధాని ముంబై వైరస్ పురుడుపోసుకున్న చైనాలోని వూహాన్ నగరాన్ని అధిగమించింది. వూహాన్‌లో మొత్తం 50,333, కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 3,869 మంది మృత్యువాత పడ్డారు. తాజా గణాంకాల ప్రకారం ముంబైలో 51,000 కేసులు నిర్ధారణ కాగా, 1,760 మరణించారు. దీంతో ప్రపంచ హాట్‌స్పాట్‌గా నిలిచిన వూహాన్‌ను మించి ముంబైలో కరోనా విభృంభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే అక్కడితో పోల్చుకుంటే ముంబైలో మరణాల సంఖ్య కొంత తక్కువగా ఉంటడం ఊరటనిస్తోంది