
New Delhi, January 7: సుప్రీంకోర్టు డాక్టర్లకు ఊరట కల్పించింది . 2021-2022 వార్షిక సంవత్సరానికి (NEET Counselling 2021-22) సంబంధించిన నీట్- పీజీ అడ్మిషన్లకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పింది.నీట్ పీజీ వైద్య విద్యార్ధులకు కోటాను ఎట్టకేలకు ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ (Supreme Court Allows 27% Reservation ), ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌కు (Other Backward Class And 10%) కోర్టు అంగీకారం తెలిపింది. దీంతో నీట్ పీజీ కౌన్సిలింగ్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.
నీట్ పీజీ కోటాపై (UG And PG Medical Seats) త్వరలో నిర్ణయం తీసుకోవాలన్ని కొన్నాళ్ల నుంచి దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు పొందేవారికి 8 లక్షల వార్షిక ఆదాయం ఉండాలన్న నిబంధన కూడా ఈ ఏడాది వర్తించనున్నది. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌పై మార్చిలో పూర్తి స్థాయిలో విచారణ జరగనున్నది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బొపన్నలతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించింది. ఆయా రాష్ట్రాల మెడికల్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటా సీట్లకు పాత రిజర్వేషన్లే వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీజీ కౌన్సిలింగ్ విషయంలో పాండే కమిటీ నివేదికను అంగీకరిస్తున్నామని, నీట్ పీజీ, యూజీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌కు లోబడే జరుగుతుందని, పాండే కమిటీ నివేదికను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు కోర్టు తెలిపింది.
ఈడబ్ల్యూఎస్ లబ్దిదారులను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న ప్రమాణాలను కొనసాగించాలని ఇంతకు ముందు విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి తెలిపింది. ప్రవేశాలు, కళాశాలల కేటాయింపులు జరుగుతున్న సమయంలో నిబంధనలు మార్చడం వల్ల గందరగోళం ఏర్పడుతుందని తెలిపింది. సవరించిన నిబంధనలు వచ్చే ఏడాదికి వర్తింపజేయవచ్చని సుప్రీం పేర్కొంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయకుండానే ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేసేందుకు రూ. 8 లక్షల వార్షికాదాయ పరిమితిని విధించిందని నీట్-పీజీ అభ్యర్థులు కొందరు సుప్రీంలో సవాల్ చేశారు. ఆదాయంతో సంబంధం లేకుండా ఐదు అంతకంటే ఎక్కువ ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు ఈ పరిమితి నుంచి మినహాంచింది.