Deepika Padukone In JNU (photo-ANI)

Mumbai, January 8: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో( Jawaharlal Nehru University) విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.అందరూ ఈ దాడిని ఖండిస్తున్నారు. వీరిలోకి దీపికా పదుకొనె (Deepika Padukone) కూడా చేరారు. జేఎన్‌యూలో జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులను ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మంగళవారం రాత్రి పరామర్శించారు. జేఎన్‌యూకి (JNU) వెళ్లిన దీపిక దాదాపు 15 నిమిషాలపాటు విద్యార్థులతో గడిపారు.

విద్యార్థులకు సంఘీభావం తెలిపిన దీపికా పదుకొనె ఏం మాట్లాడకుండానే ఉండటం గమనార్హం. మంగళవారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆమె యూనివర్సిటీకి వచ్చారు. జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్‌ను ఆమె పరామర్శించారు. ఆ తర్వా మరి కొంతమంది విద్యార్థులను కలిసి మాట్లాడారు. జేఎన్‌యూకు వెళ్లిన దీపికా వారితో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు.

Here's ANI Tweet

అలాగే ఈ దాడిలో గాయపడినవారికి సంఘీభావం తెలిపారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కూడా విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్నారు.

Tajinder Pal Singh Bagga Tweet

దీపికా పదుకొనె జేఎన్‌యూను సందర్శించిన నేపథ్యంలో బీజేపీ నేత తేజేందర్ సింగ్ బగ్గా ఆమెపై తీవ్రంగా స్పందించారు. టుక్డే టుక్డే గ్యాంగ్, అఫ్జల్ గ్యాంగ్‌కు మద్దతు పలుకుతున్న దీపికా పదుకొనె సినిమాలను బహిష్కరించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆయనతోపాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఆమెపై మండిపడుతున్నారు.