Kolkata, SEP 06: భారతీయ జనతా పార్టీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ (Chandra Kumar Bose Resigns) రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chanda).. మతపరమైన రాజకీయాలకు, విభజన రాజకీయాలకు వ్యతిరేకమని, వాటిపై విరోచిత పోరాటం చేశారని వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే అన్ని మతాలను ఏకం చేయాలని బీజేపీకి (BJP) ఆయన కీలక సూచన చేశారు. ఇక ఇదే సమయంలో తాను బయటికి వెళ్లినప్పటికీ, తన అండదండలు బీజేపీకి ఉంటాయని ప్రకటించారు. బుధవారం తన రాజీనామాపై చంద్ర కుమార్ బోస్ మాట్లాడుతూ “2016లో బీజేపీకి సహకరించాను. ప్రధాని మోదీ నాయకత్వంలో నేను మంచి అనుభూతిని పొందాను. బీజేపీలో చేరిన తర్వాత వారి రాజకీయాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chanda Bose) ఆదర్శాల ప్రకారం అన్ని మతాలను కలుపుతున్నాయని నేను భావించాను. నేతాజీ మతపరమైన, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడారు’’ అని అన్నారు.
VIDEO | "My objective was to put forward Sarat Chandra Bose and Subhash Chandra Bose's secular ideology across the country using the BJP platform. I was very clearly told that 'Azad Hind Morcha' would be formed and I would be given the leadership to this morcha but it was never… pic.twitter.com/DDwMYiaOOH
— Press Trust of India (@PTI_News) September 6, 2023
అయితే ఆయనకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేకనే రాజీనామా (Resigns From Bjp) చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా ఆయన హింట్ ఇచ్చారు. “నేను బెంగాల్ వ్యూహానికి సంబంధించి బీజేపీ, బెంగాల్ బీజేపీ కేంద్ర నాయకత్వానికి చాలా ప్రతిపాదనలు చేశాను. ఆ ప్రతిపాదనలు బాగున్నాయని చెప్పారు. కానీ అవేవీ అమలులోకి రాలేదు. నా ఆదర్శాలు, ప్రతిపాదనలు పాటించకుంటే ఈ పార్టీలో ఉండి ప్రయోజనం లేదు’’ అని ఆయన అన్నారు. అయితే మీరు అన్ని వర్గాలను ఏకం చేయాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చెప్పానని ఆయన పేర్కొన్నారు.
శరత్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ల లౌకిక భావజాలాన్ని దేశంలో విస్తృతం చేసేందుకే బీజేపీలో చేరానని, అందుకు ఆజాద్ హింద్ మోర్చా ఏర్పాటు చేయాలని నేను స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే దానికి పార్టీ నుంచి తనకు సహకారం రావాల్సి ఉన్నప్పటికీ, అది రాలేదని చంద్ర కుమార్ బోస్ అసంతృప్తి వ్యక్తం చేశారు.