Site where Nihangs attack policemen (Photo Credits: ANI)

Chandigarh, April 13: పంజాబ్‌లో నిహంగ్ వర్గీయులు పోలీసులపై కత్తులతో విరుచుకుపడిన సంగతి (Nihang Attack) విదితమే. కాగా పంజాబ్ పోలీసు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ చేతిని నిహాంగ్స్ బృందం కత్తితో నరికివేసిన కొన్ని గంటల తరువాత, చండీఘడ్‌లోని పిజిఐ వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా అతని చేతిని తిరిగి అతికించారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

కత్తులతో పోలీసులపై దాడి, పంజాబ్‌లో ఏఎస్ఐ చేయి నరికివేసిన నిహంగ్ వర్గీయులు

కాగా కరోనావైరస్ లాక్డౌన్ (Coronavirus lockdown) సమయంలో కర్ఫ్యూ అనుమతి గురించి అడిగినప్పుడు పాటియాలా ( Patiala) పట్టణంలోని ఒక పోలీసు పార్టీపై నిహాంగ్స్ దాడి చేశారు. నివేదికల ప్రకారం, వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు సాయుధ నిహాంగ్‌ల బృందాన్ని పాటియాలాలోని కూరగాయల మార్కెట్ వద్ద పోలీసులు ఆపమని కోరారు. కర్ప్యూ పాసులు చూపించమని కోరారు. అయితే వారు అవేమి చూపకుండా బారికేడ్లను ఢీకొని ముందుకు కదిలారు. వారిని అడ్డుకోబోయిన ఓ ఏఎస్ఐ (ASI Harjeet Singh) చేతిని నరికారు. మరో పోలీసుపై దాడి చేశారు.

ఈ కేసును పోలీసులు కొద్ది గంటల వ్యవధిలోనే చేధించారు. దాడికి పాల్పడిన ముఠాలోని తొమ్మిది మంది నిహాంగ్ వర్గీయులను అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. పంజాబ్ లోని పాటియాలా జిల్లాలో బార్బెరా గ్రామంలోని ఓ గురుద్వారాలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పదునైన ఆయుధాలు, ఆటోమేటిక్ కత్తులు, పెట్రోల్ బాంబులతో పాటు రూ. 35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పాటియాలా ఐజీ జతీందర్ సింగ్ ఔలఖ్ తెలిపారు. ఈ ముఠాలో దాదాపు 20 మంది సభ్యులు ఉన్నట్లు గుర్తించారు.