Nithin Gadkari says cashless treatment scheme for road crash victims

Delhi, Aug 2: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మోటారు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారి కోసం నగదు రహిత చికిత్స అందించేందుకు ఈ కొత్త పథకాన్ని రూపొందించామన్నారు. ప్రయోగాత్మకంగా అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద క్షతగాత్రులు నిర్దేశిత ఆస్పత్రుల్లో ప్రమాదం జరిగిన తేదీ నుంచి వారం రోజుల పాటు గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. తొలుత రెండు రాష్ట్రాల్లో ఆ తర్వాత దేశమంతా విస్తరిస్తామని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి ప్రాణాలను కాపాడేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్‌థానంలో ఉంది.

నగదు రహిత చికిత్సకు అయ్యే ఖర్చును మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 164 బి కింద మోటారు వాహన ప్రమాద నిధి అందిస్తుంందని వెల్లడించారు. స్థానిక పోలీసులు, ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తో సహా వివిధ శాఖలు భాగస్వాములుగా ఉంటాయని వెల్లడించారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు గడ్కరీ.

Here's Tweet: