NITI Aayog office (Photo Credits: ANI)

New Delhi, April 28: ఢిల్లీలోని నీతి ఆయోగ్ (NITI Aayog) ఆఫీసులో ప‌నిచేస్తున్న ఉద్యోగికి మంగళవారం కరోనా పాజిటివ్‌గా (NITI Aayog officer test positive for coronavirus) తేలింది. దీంతో అప్రమత్తమైన నీతి ఆయోగ్‌ అధికారులు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రోటోకాల్ పాటిస్తున్నారు. నీతి ఆయోగ్ భవనాన్ని మూసివేశారు. ప్ర‌స్తుతం ఉద్యోగులు పనిచేస్తున్నబిల్డింగ్‌ను సీజ్ చేశారు. రెండు రోజుల పాటు ఆ బిల్డింగ్‌లో శానిటైజేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్ర‌ట‌రీ అజిత్ కుమార్ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. దేశంలో 29 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలోనే 8 వేలకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 3 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

' నీతి ఆయోగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఉదయం 9గంటలకు మా దృష్టికి వచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల ప్ర‌కారం నీతి ఆయోగ్‌ భవనాన్ని (NITI Aayog Building Sealed) మూసివేస్తున్నాం. పాజిటివ్ వ‌చ్చిన అధికారితో ట‌చ్‌లో ఉన్న‌ వారిని హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లాల‌ని ఆదేశించాం. ప్రస్తుతం శానిటైజేషన్ పనులు కొనసాగుతున్నాయని నీతి ఆయోగ్ పరిపాలనా విభాగ డిప్యూటీ కార్యదర్శి అజిత్ కుమార్ తెలిపారు.

NITI Aayog officer tested positive for coronavirus, tweet shared by ANI:

కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,543 కరోనా కేసులు నమోదుకాగా, 62 మంది మృతిచెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,435కి చేరింది. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 934 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Here's what the tweet says:

దేశవ్యాప్తంగా లాక్డౌన్ యొక్క రెండవ దశ మధ్యలో దేశం ఉంది, ఇది మే 3 న ముగుస్తుందని భావిస్తున్నారు. అయితే, రాష్ట్రంలోని ముఖ్యమంత్రులందరూ నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్సులో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్లో పొడిగింపును డిమాండ్ చేశారు. దీనిపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.