No GST on These Food Items: ఈ 14 వస్తువులపై మాత్రమే జీఎస్టీ ఉండదు, అది లూజ్‌గా విక్రయిస్తేనే.. ప్రీప్యాకింగ్‌ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తే జీఎస్టీ బాదుడే..
Representative Image

New Delhi, July 19: ప్యాకేజీ ఫుడ్స్‌, ఆసుపత్రి బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడుపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోషల్‌ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. జీఎస్టీ వర్తించని కొన్నివస్తువుల జాబితాను (No GST on These Food Items) విడుదల చేశారు. జీఎస్టీపై గందరగోళం నెలకొనడంతో సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.

ప్రీప్యాకింగ్‌ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే జీఎస్టీ వర్తిస్తుందని తెలిపారు. ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, పప్పు, బియ్యం, రవ్వ, సెనగపిండి, పెరుగు, లస్సీ, మరమరాలు వంటి నిత్యావసర వస్తువులను బ్రాండెడ్‌గా, ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రమే పన్ను ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు. ఇవే ఉత్పత్తులను విడిగా, ప్యాక్ చేయకుండా, విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ఆర్థికమంత్రి వెల్లడించారు.

గతంలో వ్యాట్ ద్వారా రాష్ట్రాలు బాగా సంపాదించాయి, మేము విధించిన జీఎస్టీ మొదటి సారి కాదు, 5 శాతం జీఎస్టీపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మల

లూజ్‌గా లేదా, బహిరంగ విక్రయాలపై జీఎస్టీ వర్తించదు అంటూ 14 వస్తువుల జాబితాను(14 items when sold loose) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ట్వీట్‌ చేశారు. లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై జీఎస్టీ ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Here's List

వరుస ట్వీట్లలో స్పందించిన నిర్మలా సీతారామన్‌ గత నెలలో జీఎస్టీ కౌన్సిల్‌ 47వ సమావేశం ఏకగ్రీవ నిర్ణయం ప్రకారం చర్య తీసుకున్నామంటూ పన్ను పెంపును సమర్ధించుకున్నారు.

జీఎస్టీ వర్తించని వస్తువులు

ధాన్యాలు, పప్పులు

గోధుమలు

ఓట్స్‌

మైదా పిండి

బియ్యం

పిండి

రవ్వ

శెనగపిండి

పఫ్ఫుడ్‌ రైస్‌

పెరుగు / లస్సీ