Arvind Kejriwal. (Photo Credits: IANS)

New Delhi, April 10: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న వేళ లాక్‌డౌన్ తప్పదంటూ వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించబోవడం (No Lockdown in Delhi) లేదని స్పష్టం చేశారు. అయితే కొన్ని ఆంక్షలు మాత్రం తప్పవని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఏడు నుంచి ప‌ది రోజుల‌కు స‌రిపడా కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంద‌న్నారు. ఢిల్లీలో ప్ర‌స్తుతం క‌రోనా నాలుగో వేవ్ కొన‌సాగుతుంద‌ని ఆయన (Arvind Kejriwal) తెలిపారు.

త‌మ‌కు త‌గినంత మోతాదులో వ్యాక్సిన్ల‌ను అందించిన‌ట్లు అయితే.. ఎక్కువ సంఖ్య‌లో టీకా కేంద్రాల‌ను ఓపెన్ చేస్తామ‌న్నారు. రెండు, మూడు నెల‌ల్లో వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తామ‌ని పేర్కొన్నారు. గ‌త కొద్ది రోజుల నుంచి కొవిడ్‌పై వ‌రుస‌గా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న సీఎం కేజ్రీవాల్ ఇవాళ ఎల్ఎన్‌జేపీ ఆస్ప‌త్రిలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఢిల్లీలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 8,521 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1,45,384 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి

ఎయిమ్స్‌లో 53 మంది డాక్టర్లకు కరోనా, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కోవిడ్ పాజిటివ్, కరోనా హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం..నలుగురు మృతి, దేశంలో కొత్తగా 1,45,384 పాజిటివ్‌ కేసులు నమోదు

చాలినన్ని కరోనా డోసులు అందుబాటులో ఉండి, వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఉన్న వయసు పరమైన ఆంక్షలను తొలగిస్తే రెండుమూడు నెలల్లో ఢిల్లీ ప్రజలందరికీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇస్తామని సీఎం పేర్కొన్నారు. వయసు పరమైన ఆంక్షలను ఎత్తివేసి, వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాల్సి ఉందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.