No Revoke Ban  on Chinese Apps: చైనా యాప్స్ పై నిషేదం ఎత్తివేసే ప్రసక్తే లేదు, మరోసారి స్పష్టం చేసిన కేంద్రం, దేశ భద్రతకు ముప్పు వాటిల్లనివ్వబోమని ప్రకటన
Mobile Apps. Representational image. (Photo Credit: Pixabay)

New Delhi December 16: బ్యాన్‌ చేసిన చైనా యాప్స్ (China Apps)పై నిషేదాన్ని ఊపసంహరించుకునే ప్రతిపాదన లేదని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. నిషేదాన్ని ఎత్తివేసే ప్రసక్తే లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ మంత్రి(Electronics and Information Technology Ministry) అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభలో ప్రకటించారు. గతంలో నిషేధించిన చైనా యాప్‌లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ప్రతిపాదన ఉందా? అని లోక్‌సభ(Lok Sabha)లో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీశాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందనే కారణాలతో గతేడాది వందల సంఖ్యలో చైనా యాప్స్‌లపై(Chinese mobile applications) భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

59 Chinese Apps Banned: చైనా యాప్‌లకు భారీ షాక్, టిక్‌టాక్‌తో సహా 58 యాప్‌లపై శాశ్వత నిషేధం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద వీటిపై నిషేదం

ముఖ్యంగా పబ్‌జీ, టిక్‌టాక్‌(Tik Tok), విబో (Vibo), వీచాట్‌(WeChat), అలీఎక్స్‌ప్రెస్‌(AliExpress) వంటి ఎన్నో యాప్‌లను నిషేధిత జాబితాలో చేర్చింది. 2020 నవంబర్‌ నెలలో 43 యాప్‌లను నిషేధించిన ప్రభుత్వం.. అంతకుముందు జులై 29న 59 యాప్‌లు, సెప్టెంబర్‌ 2న మరో 118 యాప్‌లను నిషేధించింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69-ఏ కింద వీటిని నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. వందల సంఖ్యలో చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడం పట్ల అప్పట్లో డ్రాగన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ యాప్‌లపై ఆంక్షలు విధించడం తమను ఎంతో ఆందోళనకు గురిచేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ వాటిని పునరుద్ధరించే యోచన తమకు లేదని భారత్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది