Noida Woman Harassed: ప్రియుడితో పార్కుకు వచ్చిన యువతిని కోరిక తీర్చాలంటూ పోలీసుల వేధింపులు, బలవంతంగా పేటీఎం నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకున్న ఖాకీలు
కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా (Woman Harassed) వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు రూ.1000 బలవంతంగా పేటీఎం (Paytm) ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.
Lucknow, OCT 01: కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా (Woman Harassed) వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు రూ.1000 బలవంతంగా పేటీఎం (Paytm) ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో (Ghaziabad) ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 13న నోయిడాకు చెందిన 22 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల కాబోయే భర్తతో కలిసి ఘజియాబాద్‌లోని సాయి ఉపవన్ పార్క్‌ను సందర్శించింది. పోలీస్ రెస్పాన్స్ వాహనంలో విధులు నిర్వహించే ముగ్గురు పోలీసులు ఆ జంటను వేధించారు. కాబోయే భర్త చెంపపై కొట్టారు. కోరిక తీర్చాలని ఆ మహిళను పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్ బలవంతం చేశాడు. అలాగే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ జంటను విడిచిపెట్టేందుకు ఒక పోలీస్ పది వేలు మరో పోలీస్ ఏకంగా రూ.5.5 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ జంటను సుమారు మూడు గంటలపాటు వేధించారు. చివరకు ఆ మహిళ మొబైల్‌లోని పేటీఎం యాప్ నుంచి రూ.1,000 ట్రాన్స్‌పర్ చేసుకుని విడిచిపెట్టారు.
అంతటితో ఆగని ఆ పోలీసులు ఆ మహిళను ఆ తర్వాత కూడా వేధించారు (Noida Woman Harassed). సెప్టెంబర్ 19న రాకేష్ కుమార్ ఆమెకు ఫోన్ చేశాడు. తన కోరిక తీర్చాలని అసభ్యంగా మాట్లాడాడు. ఆమె ఆ కాల్‌ను రికార్డ్ చేసింది. సెప్టెంబర్ 22న ఆ ముగ్గురు ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో పోలీసుల వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. అత్యవసర నంబర్‌కు కాల్ చేసింది.
TN Bus Accident: ఊటీ సమీపంలో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ టూరిస్టు బస్సు, తొమ్మిది మంది ప్రయాణికులు మృతి
కాగా, మహిళ నుంచి విషయం తెలుసుకున్న ఘజియాబాద్ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. ఆమెను లైంగికంగా వేధించిన పోలీసులపై పలు సెక్షన్ల కింద సెప్టెంబర్ 28న కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులైన కానిస్టేబుల్ రాకేష్ కుమార్, హోంగార్డు దిగంబర్ కుమార్‌తోపాటు మరో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. హోంగార్డ్‌పై చర్యల కోసం ఆ విభాగానికి లేఖ రాసినట్లు చెప్పారు.
(The above story first appeared on LatestLY on Oct 01, 2023 09:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

