Non-bailable warrant issued against Jaya Prada for violation of model code of conduct (Photo-ANI)

Lucknow, Mar 07: ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రదకు (BJP leader Jaya Prada) రాంపూర్ కోర్టు (Rampur court) నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant) జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను రాంపూర్ కోర్టు ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది. జయప్రద రాజకీయ ప్రత్యర్థి అజం ఖాన్ కూడా మోసం కేసులో జైలులో ఉన్నాడు.

రూ.5 లక్షల కోట్లతో యూపీ బడ్జెట్

గతంలో సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) నుంచి ఎంపీగా గెలుపొందిన జయప్రద 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాషాయ పార్టీ తరఫున రాంపూర్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జయప్రద ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌ (Azam Khan) చేతిలో ఓటమి పాలయ్యారు.

దాదాపు లక్ష ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆమెకు స్థానిక కోర్టు వారెంట్‌ జారీ చేసింది.

Here ANI Tweet

కాగా 2019 ఎన్నికల ప్రచారంలో ఆజంఖాన్‌ జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అమ్రపాలి (నృత్యకారిణి), నాచ్‌ నే వాలీ’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జయప్రద పార్టీ మారిన సమయంలో.. ‘ఆమెను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్‌ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.