TRAI Good News: కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్, రూ.130కే 200 ఛానల్స్, 12 రూపాయలకే నచ్చిన స్పోర్ట్స్ ఛానల్, తాజాగా సవరణలు చేసిన ట్రాయ్
Now 200 channels instead of 100 in Rs 130, says TRAI (Photo-Pixabay)

Mumbai,January 13: కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) (Telecom Regulatory Authority of India (TRAI))శుభవార్తను చెప్పింది. ట్రాయ్ తాజా సవరణల ప్రకారం బిల్లు భారం ఇకపై కాస్త తగ్గనుంది. కొత్త సవరణలతో కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది. వినియోగదారులకు మేలు చేసే విధంగా టారిఫ్ ఆర్డర్‌లో ట్రాయ్ తాజాగా సవరణలు(New Tariff Order (NTO)) చేసింది. రూ.130కే (NCF) ఫ్రీ టూ ఎయిర్‌ చానెల్స్‌ ఇవ్వాలని ట్రాయ్(TRAI నిర్ణయించింది.

ట్రాయ్ చేసిన ఈ సవరణల ప్రకారం ఇక 130 రూపాయలకే దాదాపు 200 ఛానల్స్‌ను వీక్షించే అవకాశం ఉంది. గతంలో వంద ఛానల్స్ మాత్రమే చూసే వీలుంది. దీంతో పాటుగా మెజార్టీ ప్రజలు వీక్షించే స్పోర్ట్స్ ఛానల్స్ (Sports Channels)ధరలు కూడా ఒక్కో ఛానల్‌కు 12 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. బొకే చానెల్స్‌లో ఒక ఛానెల్‌ ఖరీదు రూ.12కు మించకూడదని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ దీని ధర రూ.19 గా ఉండేది.

ప్లేస్‌మెంట్ మార్చాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే 40 శాతం వసూలు చేయాలని కేబుల్ ఆపరేటర్లకు ట్రాయ్‌ సూచించింది. కేబుల్ బిల్లు భారంతో సతమతమవుతున్న వినియోగదారులకు ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం కాస్త ఉపశమనం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.