Representational Image (File Photo)

New Delhi, NOV 11: రిటైరయిన తర్వాత వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) తెచ్చింది. పన్ను ఆదా చేయడానికి ఇది ఒక బెటర్ రిటైర్మెంట్ ఫండ్ (Fund) అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా మంచి రిటర్న్స్ ఇచ్చే పొదుపు స్కీంగానూ పని చేస్తుంది. మిగతా రిటైర్మెంట్ ఫండ్స్‌తో పోలిస్తే ఎన్పీఎస్ (NPS) నుంచి తేలిగ్గా నగదు ఉపసంహరించుకోవచ్చు. అందుకు కొన్ని నియమ నిబంధనలు తయారు చేసింది కేంద్రం.. అవేమిటో ఓ లుక్కేద్దామా..

రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్‌లో డిపాజిట్ చేసిన మొత్తంలో కనీసం 40 శాతం యాన్యుటీ బాండ్లలో పెట్టుబడి పెట్టి.. మిగతా మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. అలాకాకుండా ఒకేసారి విత్ డ్రా (NPS Withdraw) చేసుకోకుండా 70 ఏండ్ల వయస్సు వరకూ ఎన్పీఎస్ లోనే కొనసాగించవచ్చు. రిటైర్మెంట్ కల్లా ఎన్పీఎస్ లో రూ.5లక్షలు, అంతకంటే తక్కువ ఉంటే మొత్తం సొమ్మూ ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి పన్ను మినహాయింపు ఉంటుంది.

LIC Saral pension Scheme: ఎలాంటి ఉద్యోగం చేయకుండానే నెల నెల పెన్షన్ కావాలా, అయితే ఎల్ఐసీలోని ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి, ప్రతి నెలా పెన్షన్ సౌకర్యం 

వీఆర్ఎస్‌పై వెళ్లే ప్రభుత్వోద్యోగులు ఎన్పీఎస్ ఖాతాలో (NPS Account) డిపాజిట్ చేసిన మొత్తంలో 80 శాతం యాన్యూటీ బాండ్లలో పొదుపు చేయాలి. డిపాజిట్ చేసిన మొత్తం రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ కార్పొరేట్ సంస్థ ఉద్యోగి గానీ, ప్రభుత్వోద్యోగి గానీ రిటైర్మెంట్ కు ముందే మరణిస్తే మొత్తం సొమ్ము నామినీకి గానీ, చట్టబద్ధమైన వారసులకు గానీ చెల్లిస్తారు.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త.. పెన్షన్‌ వివరాల సమర్పణకు మరో 3 నెలలు గడువు 

కనీసం పదేండ్లు ఎన్పీఎస్‌లో డిపాజిట్ చేస్తేనే మధ్యలో వైదొలగడానికి అవకాశం ఉంటుంది. అలా కూడా డిపాజిట్ చేసిన మొత్తంలో 80 శాతం యాన్యుటీ బాండ్లలో పొదుపు చేయాలి. డిపాజిట్ చేసిన మొత్తం రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు.

ఎన్పీఎస్ పథకంలో సభ్యులుగా కొనసాగుతున్న వారు మూడు సార్లు మాత్రమే నగదు పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. కనీసం మూడేండ్ల పాటు ఎన్పీఎస్‌లో మదుపు చేసిన వారే పాక్షికంగా నగదు విత్ డ్రాయల్ చేసేందుకు అర్హత కలిగి ఉంటారు. పిల్లల చదువులు, వివాహాలు, ఇంటి నిర్మాణం, వైద్య ఖర్చులకు మాత్రమే ఎన్పీఎస్ నిధులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటది. ఎన్పీఎస్ ఖాతా నుంచి కేవలం మూడు సార్లు మాత్రమే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఎన్పీఎస్ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 25 శాతమే విత్ డ్రా చేసుకునేందుకు నిబంధనలు అనుమతి ఇస్తాయి.