airtel

భారతి ఎయిర్‌టెల్ తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచిత ‘నెట్‌ఫ్లిక్స్‌’ సబ్‌స్క్రిప్షన్‌ను మొబైల్ రీచార్జ్ ప్లాన్ల కింద ఎయిర్‌టెల్ అందించింది. ఒక ప్రీపెయిడ్ ప్లాన్, రెండు పోస్ట్‌పెయిడ్ మొత్తం మూడు ప్లాన్ల కింద నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేసింది.  ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ. 1,199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ కింద నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇక రూ.1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కూడా ఈ మూడు ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా అందిస్తోంది. రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 100 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లను ఆఫర్ చేస్తోంది. 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను వెంటనే బ్లాక్ చేయాలని డాట్ ఆదేశాలు, 20 లక్షల మొబైల్ కనెక్షన్లను రీ-వెరిఫై చేయాలని ఆర్డర్

అదనపు ప్రయోజనాలుగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అపరిమిత 5జీ డేటా, అపోలో 24|7 సర్కిల్ సేవలు, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్‌లను పొందొచ్చని ఎయిర్‌టెల్ వెల్లడించింది. రూ. 1,199, రూ. 1,499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో కూడా 5జీ అపరిమిత డేటా లభిస్తుందని భారతి ఎయిర్‌టెల్ వివరించింది.భారత్‌లో భారతి ఎయిర్‌టెల్ 380 మిలియన్ల మంది యూజర్లను కలిగివుంది.