Nupur Sharma Prophet Remark: నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆమెను చంపేస్తామని బెదిరింపు కాల్స్ ఎవరు చేస్తున్నారు, బెదిరింపుల నేపథ్యంలో నూపుర్‌ శర్మకు భద్రత కల్పించిన ఢిల్లీ పోలీసులు
Nupur Sharma (Photo-ANI)

New Delhi, June 7: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదంలో చిక్కుకుని సస్పెండైన బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ, ఆమె కుటుంబానికి ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు భద్రత కల్పించారు. తనను చంపుతామంటూ బెదరింపు కాల్స్ వస్తున్నాయంటూ నుపర్ శర్మ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మతో (BJP Spokesperson Nupur Sharma) పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. తనకు హతమారుస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో (Nupur Sharma Prophet Remark) ముస్లిం దేశాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి నేపథ్యంలో నూపుర్‌ శర్మతో పాటు నవీన్‌కుమార్‌ జిందాల్‌ను బీజేపీ అధిష్ఠానం బహిష్కరించింది. దేశీయ మతసంస్థలతో పాటు కువైట్‌, ఖతార్‌, ఇరాన్‌ తదితర దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బీజేపీ ఇద్దరు నేతలను సస్పెండ్‌ చేయడంతో పాటు ప్రకటన విడుదల చేసింది. పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని, వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. కాగా, తన చిరునామాను బహిర్గతం చేయవద్దని మీడియా సంస్థలు, ప్రజలకు నుపుర్ శర్మ ఒక ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.

సీడీఎస్ నియామకంలో కేంద్రం సంచలన నిర్ణయం, సీడీఎస్ అర్హత పరిధిని సడలిస్తూ కీలక మార్పులు, ఇక రిటైరైన అత్యున్నత అధికారులకు కూడా సీడీఎస్ బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం

ఇదిలా ఉంటే మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు (Remarks Against Prophet Muhammed) చేసి బీజేపీ నుంచి సస్పెండయిన ఆ పార్టీ ప్రతినిధి నూపుర్ శర్మకు థానె పోలీసులు సమన్లు పంపారు. ఈనెల 22న తమ ముందు హాజరుకావాలంటూ ముంబ్రా పోలీసులు మెయిల్, పోస్ట్ ద్వారా సమన్లు పంపారు. ముంబ్రా పోలీస్ స్టేషన్‌లోనే కాకుండా ముంబై పైధోని పోలీస్ స్టేషన్‌లోనూ నుపుర్‌పై కేసు నమోదైంది.

FIR filed against Nupur Sharma

నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విమర్శలకు దారితీసింది. ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, కువైత్, బహ్రెయిన్, ఇండోనేసియా, ఇరాన్‌తో పాటు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అధికారికంగా నిరసనలు తెలిపాయి. క్షమాపణ చెప్పాలని కోరాయి. శర్మ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అన్ని మతాలు, మనోభావాలను భారత్ గౌరవిస్తుందని బీజేపీ ఒక ప్రకటన చేయడంతో పాటు నుపర్ శర్మ, సోషల్ మీడియాలో మహమ్మద్ ప్రవక్తను కించపరచేలా వ్యాఖ్యలు చేసిన మరో నేత నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నవీన్‌ కుమార్‌ జిందాల్‌ ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్‌గా ఉన్నారు. సస్పెన్షన్‌ లెటర్‌లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావున మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నామం’ అని బీజేపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది.

Here's BJP statement

అయితే పార్టీ సస్పెండ్‌ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నూపుర్‌ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఆమె తన వైఖరిని వివరిస్తూ ‘గత చాలా రోజులుగా మా మహాదేవ్‌ శివుడిని అవమానిస్తూ, అగౌరవపరుస్తుండటంతో నేను టీవీ చర్చలకు హాజరవుతున్నాను.

Here's  Nupur Sharma StateMent

జ్ఞానవాపి మసీదు వద్ద ఉంది లభించింది శివలింగం కాదు.. ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబుతున్నారు. శివలింగాన్ని ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చడం ద్వారా కూడా వెక్కిరిస్తున్నారు. మా శివుడిని ఇలా నిరంతరంగా అగౌరవపరచడాన్ని నేను సహించలేకపోయాను. దీనిపై ప్రతిస్పందిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పాను* అని నూపుర్ శర్మ చెప్పారు.

Arabs are campaigning to boycott Hindustan products

ఇదిలా ఉంటే కువైట్‌లోని వ్యాపార సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై నిరసనగా భారతీయ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశాయి. కువైట్‌ సిటీలోని అల్-అర్దియా కో-ఆపరేటివ్ సొసైటీ స్టోర్ ర్యాకుల నుంచి ఇండియన్‌ టీ, ఇతర ఉత్పత్తులను తొలగించారు. అలాగే కువైట్‌ నగరం వెలుపల ఉన్న ఒక సూపర్‌ మార్కెట్‌లోని ర్యాకుల్లో ఉన్న రైస్‌, ఇతర భారతీయ ఉత్పత్తులపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పారు. ‘భారతీయ ఉత్పత్తులను తొలగించాం’ అని అక్కడ నోటీస్‌ ఉంచారు. ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని కువైటీ ముస్లిం ప్రజలు ఏ మాత్రం సహించరని ఆ స్టోర్‌ సీఈవో నాసర్‌ అల్-ముతైరి తెలిపారు. తమ సంస్థకు చెందిన అన్ని స్టోర్లలో భారతీయ ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేసినట్లు చెప్పారు.

నుపూర్‌ శర్మ మహమ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలేంటి?

వివాదంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో ఓ టీవీ చర్చలో పాల్గొన్న నూపుర్‌.. ఇస్లామిక్ మతపరమైన పుస్తకాల్లోని కొన్ని విషయాలను ప్రజలు ఎగతాళి చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. మసీదు కాంప్లెక్స్‌లో కనిపించిన శివలింగాన్ని ఫౌంటెన్‌గా పిలుస్తూ ముస్లింలు హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైంది. అప్పటినుంచి మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. జర్నలిస్టు, ప్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్... ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రవక్తపై నూపుర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు. ఆ తర్వాత, ఈ అంశంపై పెద్ద దుమారం మొదలైంది. భారత్, పాకిస్తాన్‌లోని సోషల్ మీడియాలో దీనిపై చాలా వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో బీజేపీ దిల్లీ అధికార ప్రతినిధి నవీన్‌ కుమార్‌ జిందాల్‌ కూడా మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా ట్వీట్‌ చేస్తూ వివాదాన్ని మరింత పెంచారు.