Keonjhar, June 13: ఒడిశాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మద్యం ఉన్న ఓ వ్యక్తికి అతని తండ్రి మరణ శిక్ష (Keonjhar man ties up 40-yr-old son) వేశాడు. తాగిన మత్తులో ఎప్పుడూ భార్యతో గొడవ పడే ఓ వ్యక్తి... ఆ రోజు తల్లితో గొడవ పడి ఆమెను కొట్టాడు. దాంతో ఆమె నడుము దగ్గర ఫ్రాక్చర్ అయింది. ఈ విషయం తెలిసిన అతని తండ్రికి విపరీతమైన కోపం కుమారుడితో గొడవ పడ్డాడు. అయినా అతను మాట వినకపోవడంతో చేతులు, కాళ్లు కట్టేసి మండుటెండలో పడేశాడు.ఆ ఎండ ధాటికి తట్టుకోలేకపోయిన ఆ కుమారుడు.. సాయంత్రానికి (leaves him to die in the sun) చనిపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని కోంజిహార్ ప్రాంతంలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పనువా నాయక్ అనే 65 ఏళ్ల వ్యక్తి హైవే పక్కన చిన్న ఫుడ్ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమారుడు సుమంత్ నాయక్ పనీపాటా లేకుండా తిరుగుతూ ఉంటాడు. మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేయడం అతని అలవాటు. కొన్నిరోజుల క్రితం ఇంటికి వచ్చిన సుమంత్.. మద్యం మత్తులో తల్లితో గొడవ పడి ఆమెను విపరీతంగా కొట్టాడు. దాంతో ఆమె నడుం ఫ్రాక్చర్ అయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పనువా నాయక్.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సుమంత్ కాళ్లు, చేతులు కట్టేసి ఎండలో పడేశాడు.
కాసిని మంచి నీళ్లు ఇవ్వమని సుమంత్ ఎంత వేడుకున్నా అతని మనసు కరగలేదు. ఎండ వేడి తట్టుకోలేక సుమంత్ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకొని పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అరెస్టు అయిన తర్వాత కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని, తల్లిని కొట్టినందుకు మాత్రమే శిక్షించానని, కుమారుడు చనిపోయినందుకు తనకు ఎలాంటి బాధా లేదని పనువా నాయక్ తేల్చిచెప్పాడు. పోస్టుమార్టం చేసిన తర్వాత అతనిపై ఎలాంటి కేసు పెట్టాలో నిర్ణయిస్తామని, ప్రస్తుతానికి పనువా నాయక్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కోంజిహార్ ప్రాంతంలో 36 డిగ్రీల ఎండ మాత్రమే ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ.. హ్యుమిడిటీ 56 శాతం ఉండటంతో చాలా వేడిగా ఉంది. ఆ వేడి తట్టుకోలేకనే సుమంత్ చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు.