Puri Jagannath Temple Stampede (photo-X)

ఒడిశా (Odisha)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ స్వామి (Puri Jagannath ఆలయంలో శుక్రవారం ఉదయం తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉదయం 'మంగళ ఆలటి' నిర్వహించిన తరువాత భక్తులను లోపలకు అనుమతించడంతో ఆలయం మెట్లపై ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.ఆలయంలోని ఘంటిద్వార, సతపహచ సమీపంలో తొక్కసలాట జరిగినట్లు సమాచారం.

వీడియో ఇదిగో, ప్రచార వాహనంపై నుంచి కిందపడిన మంత్రి కేటీఆర్, ఎంపీ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి, కేటీఆర్‌కు స్వల్ప గాయాలు

ఒడిశాలో గత పౌర్ణమి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని నేడు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో ఉదయం ఆలయంలో ‘మంగళ ఆలతి’ నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీంతో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలోకి నెట్టుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.