Bhuvaneswer, OCT 09: ఒడిశాలో (Odisha) దారుణం జరిగింది. ఒక మహిళ… తన భర్త మర్మాంగాన్నికోసి, ఆపై కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన ఒడిశా, జాజ్‌పూర్ జిల్లా (Jajpur District), పుబోలా ముందసాహి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు చంపియా అనే వ్యక్తికి, కుని చంపియా (Champiya) అనే మహిళతో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. రాజుకు ఇది రెండో వివాహం. కాగా, అతడు కుని ఇంటివద్దే ఇల్లరికం ఉంటున్నాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఇద్దరిమధ్యా గొడవ జరిగింది. ఆ తర్వాత భర్త రాజు నిద్రపోయాడు. కాస్సేపటికి భార్య పదునైన కత్తి తీసుకుని, భర్త మర్మాంగాన్ని కోసేసింది (Chops Off Husband's Genital). తర్వాత అతడ్ని అదే కత్తితో పొడిచి హత్య చేసింది.
భర్త మరణించిన తర్వాత అక్కడ్నుంచి పారిపోయింది. తర్వాత స్థానికుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక ప్రత్యేక బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు.
భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య...దాన్ని శవం పక్కనే పడిసి పారిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి...హంతకురాలి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. రాజు మొదటి భార్య మూడేళ్ల క్రితం వెళ్లిపోయిందని, దాంతో ఈమెను రెండో పెళ్లి చేసుకున్నాడని స్థానికులు చెప్తున్నారు. ఇద్దరి మధ్య చంపుకునేంత గొడవ ఎందుకొచ్చింది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.