Ola Electric launches e-motorcycle series 'Roadster'; Check price, features

ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) ‘రోడ్‌స్టర్‌’ పేరిట మోటార్‌ సైకిల్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. విద్యుత్‌ స్కూటర్లు మాత్రమే విక్రయిస్తున్న ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి మోటార్‌ సైకిల్ ఇదే. దీని ధర రూ.74,999 నుంచి ప్రారంభం అవుతుంది. రోడ్‌ స్టర్‌ మొత్తం మూడు వేరియంట్లలో (రోడ్‌ స్టర్‌ (Roadster), రోడ్‌స్టర్‌ ఎక్స్‌ (Roadster X), రోడ్‌ స్టర్‌ ప్రో (Roadster Pro) పేరిట లభిస్తుంది.

రోడ్‌ స్టర్ ఎక్స్‌ (Roadster X) : రోడ్ స్టర్‌ సిరీస్‌లో అందుబాటు ధరలో లభించే వేరియంట్‌ ఇది. మూడు బ్యాటరీ ప్యాక్స్‌, 2.5kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.74,999గా కంపెనీ నిర్ణయించింది. ఇక 3.5kWh వేరియంట్‌ ధర రూ.85,999 కాగా.. 4.5kWh వేరియంట్‌ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. సింగిల్‌ ఛార్జ్‌తో ఇది గరిష్ఠంగా 200 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుందని, దీని టాప్‌ స్పీడ్‌ 124 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ 4.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో వస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

రోడ్‌ స్టర్‌ (Roadster): దీని ప్రారంభ (3.5kWh) ధర రూ.1.04 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 4.5kWh బ్యాటరీ ప్యాక్‌ ధర రూ.1,19,999 కాగా.. 6kWh బ్యాటరీ ప్యాక్‌ ధరను రూ.1,39,999గా కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌ టాప్‌ స్పీడ్‌ 126 కిలోమీటర్లు. 3.5kWh బ్యాటరీ ప్యాక్‌తో 151km, 4.5 kWhతో 190 కిలోమీటర్లు, 6kWh బ్యాటరీతో 248 కిలోమీటర్లు రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 6.8 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రంగంలో ఓలా సంచ‌ల‌నం, త్వ‌ర‌లోనే ఓలా ఎల‌క్ట్రిక్ బైక్ రిలీజ్ చేయ‌నున్న కంపెనీ, ఫీచ‌ర్స్ ఇవి!

రోడ్‌ స్టర్ ప్రో (Roadster Pro):  రోడ్‌స్టర్‌ సిరీస్‌లో హై ఎండ్‌ వేరియంట్‌ ఇది. ఈ బైక్‌ టాప్‌ స్పీడ్‌ 194 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. 9 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న బైక్‌ ధర రూ.1.99 లక్షలు కాగా.. 16kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ధర రూ.2.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్‌ డెలివరీలు 2025 దీపావళి నుంచి ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌ సింగిల్ ఛార్జ్‌తో 579 కిలోమీటర్లుగా పేర్కొంది. ఇందులో 10 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్‌ డిస్‌ప్లే ఉంటుంది.