Ola To Recal lElectric Scooters: ఆ స్కూటర్లు వెనక్కు ఇచ్చేయండి! 1400కు పైగా ఎలక్ట్రిక్ బైక్‌లను వెనక్కు రప్పిస్తున్న ఓలా, వరుస ఘటనలతో కీలక నిర్ణయం

New Delhi, April 24: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Scooters), బ్యాటరీల పేలుళ్లు ( catching fire) ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. వాహనాల తయారీలో లోపాలుంటే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఓలా (Ola) కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ (Ola To Recall) చేస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందంజలో ఉన్న కంపెనీల్లో ఓలా ఒకటి. అయితే, గత నెలలో ఓలా స్కూటర్లు (Ola Scooters), బ్యాటరీలు పేలిపోయిన సంఘటనలు వెలుగుచూశాయి.

Ola Hyperchargers: ఓలా బంపర్ ఆఫర్, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ యూజర్లకు హైపర్‌ ఛార్జింగ్‌ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్‌, భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఓలా

ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు గల కారణాలను కనుగొనేందుకు కంపెనీ సిద్ధమైంది. ఇప్పటికే విక్రయించిన 1,441 ఓలా స్కూటర్లను రీకాల్ (Ola To Recall) చేసింది. సంస్థకు చెందిన ఇంజనీర్లు బ్యాటరీలు (Battery), వాహనాలను పూర్తిగా తనిఖీ చేస్తారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే లోపాలను సరిదిద్దుతారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రమాణాలకు అనుగుణంగా తమ వాహనాలు ఉండేలా చూస్తామని ఓలా ప్రకటించింది. దేశంలో ఈమధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది.

Ola Electric Bike Explodes: అమ్మో ఎలక్ట్రిక్ బైక్‌లు! టపాసుల్లా పేలుతున్న ఈ బైక్‌లు, ఒకేరోజు రెండు ఘటనలు, పుణెలో పేలిన ఓలా బైక్, తమిళనాడులో స్కూటీ పేలి తండ్రి కూతురు మృతి

వాహనాలు కాలిపోవడం లేదా బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు మరణిస్తున్నారు కూడా. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఒకినావా ఆటోటెక్ అనే సంస్థ తమ కంపెనీకి చెందిన 3,000కు పైగా వాహనాలను రీకాల్ చేసింది. వినియోగదారులు తమ వాహనాలను స్వచ్ఛందంగా అందించాలని కంపెనీలు కోరుతున్నాయి.