Uttar Pradesh, June 07: ఒక బాలుడి గొంతులో రూపాయి నాణెం ఇరుక్కుంది. అయితే ఏడేళ్ల తర్వాత దీనిని డాక్టర్లు గుర్తించారు. సర్జరీ ద్వారా ఆ కాయిన్‌ను బయటకు తీశారు. (Coin Stuck In Boy’s Throat) ఉత్తరప్రదేశ్ బఘౌలీలోని మురళీపూర్వ గ్రామానికి చెందిన 12 ఏళ్ల అన్‌కుల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కడుపు నొప్పితో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించడంతో కోలుకున్నాడు. కాగా, జూన్ 4న గొంతులో నొప్పిగా ఉందని ఆ బాలుడు తన కుటుంబానికి చెప్పాడు. తాత వెంటనే హర్దోయ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఎక్స్ రే తీయగా రూపాయి నాణెం గొంతులో ఇరుక్కున్నట్లు ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ వివేక్ సింగ్ గుర్తించారు. ఆహార గొట్టం వద్ద చిక్కుకున్న ఆ నాణెన్ని టెలిస్కోప్ సర్జరీ విధానం ద్వారా బయటకు తీశారు.
Horrific Video: వైజ్ సిటీ గేమ్ తరహాలో కార్లపై బుల్లెట్ల వర్షం.. వైరల్ అవుతున్న భయానక వీడియో
మరోవైపు ఏడేళ్ల కిందట ఐదేళ్ల వయసులో రూపాయి నాణేన్ని ఆ బాలుడు మింగినట్లు డాక్టర్ వివేక్ సింగ్ తెలిపారు. ఆహార గొట్టంలో ఒక పక్కగా నాణెం చిక్కుకోవడంతో ఆ బాలుడికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదని చెప్పారు. నల్లగా మారుతున్న ఆ నాణెం వల్ల నెలన్నర కిందట బాలుడికి కామెర్లు వచ్చాయని అన్నారు.
కాగా, బాలుడి గొంతులో ఏడేళ్లుగా నాణెం ఇరుక్కుపోవడం చాలా అరుదైన కేసు అని డాక్టర్ వివేక్ సింగ్ తెలిపారు. సర్జరీ ద్వారా తొలగించిన తర్వాత అనేక సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువని అన్నారు. ఈ నేపథ్యంలో బాలుడ్ని తరచుగా వైద్యపరీక్షలకు తీసుకురావాలని అతడి కుటుంబానికి సూచించినట్లు చెప్పారు.