Onion Price Hike Again: సెంచురీ దిశగా ఉల్లి ధరలు, సామాన్యులు కొనలేని పరిస్థితి, మహారాష్ట్రలో భారీగా దెబ్బతిన్న ఉల్లి పంటలు, మరో 10 రోజుల పాటు ఇదే ధరలు కొనసాగే అవకాశం
onion-prices-continue-to-rise-in-some-states-due-to-shortage-likely-to-touch-rs-100-per-kg-in-coming-days (Photo-ANI)

New Delhi: ఉల్లిపాయ ధరలు(Onion Price) భారీగా పెరిగిపోయాయి.  కొండెక్కి దిగనంటున్నాయి. సామాన్యులు ఉల్లిపాయ  కొనలేని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర వందరూపాయలకు చేరుకునే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఢిల్లీలో ఉల్లిపాయలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్ముతున్నారు. హైదరాబాద్‌(Hyderabad)లో కిలో ఉల్లి ధర రూ.50 70 మధ్య అమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)లో వీటి ధర రూ.70 నుంచి 80 మధ్య ఉంది.

ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో కిలో ఉల్లి ధర రూ. 80 పలికిన విషయం తెలిసిందే. కానీ తరువాత ఎక్కువగా కాకపోయినా కొద్దిగా దిగి వచ్చింది. కానీ మళ్లీ ఉల్లి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఉల్లి ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కిలో ఉల్లిపాయలు కొందామని వెళ్లిన వారు పావు కిలోతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు.

ఛండీఘర్(Chandigarh) లో కిలో ఉల్లిపాయలు ఒక్కరోజులోనే రూ.30లు పెరిగి షాక్ ఇచ్చింది. సోమవారం (నవంబర్ 4)రూ.50 నుంచి ఒక్కసారిగా పెరిగిపోయి మంగళవారానికి రూ.80 కి పెరిగింది. మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోవడంతో డిమాండ్‌ పెరిగింది. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.90 పలుకుతున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఉల్లి టమాటాలపై సమీక్ష నిర్వహించింది. త్వరలోనే ధరలను నియంత్రణలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.

ఛండీఘర్ లో ఉల్లి ధరలు

మహారాష్ట్రలోని కొన్ని జోన్లలో బాగా పండే ఉల్లి పంటల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. భారీ వర్షాలతో ఉల్లి పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందిన రిపోర్టుల ప్రకారం.. లాస్లాగన్ హోల్ సేల్ మార్కెట్ సగటున ఉల్లిధరలు కిలో రూ.55.50 వరకు పెరిగాయి. నవంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలతో పెద్దమొత్తంలో ఉల్లి పంటలు దెబ్బతిన్నాయని, అందుకే ఉల్లి ధరలు ఎక్కువగా పెరిగాయని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూపీలో ధరలు

కొత్త ఉల్లి పంట భారీగా నష్టం వాటిల్లడంతో కొంతమంది రైతులు తమ పాత స్టాక్ ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు కిలో రూ.100 వరకు చేరుకునేలా ఉన్నాయి. హోల్ సేల్ మార్కెట్లో గత మూడు నెలల్లో ఉల్లి ధరలు నాలుగో వంతు పెరిగినట్టు ఓ రిపోర్టు తెలిపింది. కొత్త ఉల్లి పంట దెబ్బతినడంతో పాత స్టాక్ ఉల్లి ధరలు కూడా మార్కెట్లో భారీగా పెరిగాయని ఉల్లి రైతులు చెబుతున్నారు.

అకాల వర్షాలకు ఉల్లి పంటతో పాటు పలు పంటలు ధ్వంసం అయ్యాయి.ఇక టమాటా ధర(tomato price) కూడా ఎర్రగా మండుతోంది. అయితే ధరలు నియంత్రణలోకి వచ్చేందుకు మరో 2 నుంచి 3వారాల సమయం పడుతుందని కూరగాయలు వ్యాపారులు చెబుతున్నారు.