Mumbai, June 13: ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు అడ్వైజరీ జారీ (Narendra Modi Govt Issues Advisory) చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చట్ట విరుద్ధమని (Banning Ads Promoting Online Betting Platforms) పేర్కొంది. ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వాటిని వినియోగిస్తున్న వారికి ఆర్థిక, సామాజిక నష్టాన్ని పెంచుతాయని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కలకలం, భారత్‌పై సైబర్ దాడులు.. ఏకంగా 70 వెబ్‌సైట్లు హ్యాక్ చేసిన హ్యాకర్లు
ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రకటనలను ప్రచురించవద్దు. ఆన్‌లైన్ అడ్వర్టైజ్మంట్ పబ్లిషర్స్, ఇండటర్మీడియరీస్ సహా ఆన్‌లైన్, సోషల్ మీడియాలు (TV, Print And Digital) సైతం ప్రకటనలకు దూరంగా ఉండాలి. బెట్టింగ్, గ్యాంబ్లింగ్.. దేశంలోని చాలా ప్రాంతాల్లో చట్టవిరుద్ధం. ముఖ్యంగా చిన్నారులు, యువత సహా వాటిని వినియోగదారులకు ఆర్థిక, సామాజిక నష్టాన్ని పెంచుతాయి. ఆయా ప్రకటనల ద్వారా చట్టవిరుద్ధమైన ఈ చర్యను ప్రోత్సహించినట్లవుతుందని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, ఆన్‌లైన్ మీడియాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్స్ ప్రకటనలు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ అడ్వైజరీ జారీ చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు సూచనలు చేసినట్లు పేర్కొంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఇవి వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019కి విరుద్ధమని పేర్కొంది. ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978కి విరుద్ధంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్‌ను ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ప్రజా ప్రయోజానాలను కాపాడే క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై తాజా మార్గదర్శకాలను జారీ చేశామని తెలిపింది.