New Delhi, February 4: భారత్‌లో కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ సాగుతోంది. దేశవ్యాప్తంగా 4 మిలియన్లకు పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య సిబ్బంది టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 45 శాతం హెల్త్ కేర్ సిబ్బంది లబ్ది పొందినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి.
దేశంలో కొవిడ్ కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 12,899 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 1,07,90,183కు చేరింది. నిన్న ఒక్కరోజే 107 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,55,025కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,824 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,04,80,455 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,55,025 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
India's COVID Status Update:
India reports 12,899 new COVID-19 cases, 17,824 discharges, and 107 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,07,90,183
Total discharges: 1,04,80,455
Death toll: 1,54,703
Active cases: 1,55,025
Total Vaccination: 44,49,552 pic.twitter.com/9htSqA3Quu
— ANI (@ANI) February 4, 2021
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.13% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.44% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.43% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక ఫిబ్రవరి 3 వరకు దేశవ్యాప్తంగా 19,92,16,019 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,42,841శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.