Newdelhi, Aug 8: దేశవ్యాప్తంగా 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్‌లను (Mobile Connections) గుర్తించామని అందులో 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు (Telcos) రద్దు చేసినట్టు బుధవారం లోక్ సభలో కేంద్రం తెలిపింది. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) టెల్కోలను ఆదేశించినట్టు వెల్లడించింది. నకిలీ రుజువులతో సిమ్‌లను యాక్టివేట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు స్పందించింది.
రద్దు ఎందుకంటే?
రీవెరిఫికేషనల్‌లో విఫలమైన మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది. నకిలీ ఐడీలు లేదా అడ్రస్ లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవస్థని రూపొందించినట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.