Rajnath Singh: పాకిస్తాన్‌కు దక్కేది ఓటమే, 1848 నుంచే ఆ దేశానికి తెలుసు, పరోక్ష యుద్ధంలోనూ దాయాది దేశంకు పరాజయం తప్పదన్న రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
Pakistan chose proxy war through terrorism, will be defeated: Defence Minister Rajnath Singh (Photo-ANI)

Pune,December 1: గత కొంత కాలం నుంచి దాయాది దేశం(Pakistan) మనదేశం మీద ఆగ్రహంతో ఉన్న సంగతి విదితమే. ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత పాకిస్తాన్ మరింత కోపంతో రగిలిపోతోంది. ఎప్పుడు దాడులు చేద్దామా అని కాచుకూర్చుని ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Defence Minister Rajnath Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష యుద్ధంలో ఎలాగూ గెలవలేమనే పాకిస్తాన్‌ పరోక్ష యుద్ధానికి (Proxy War) ప్రయత్నిస్తోందని అయితే ఇందులోనూ ఆ దేశానికి ఓటమి తప్పదని (Pakistan's Proxy War Will End In Defeat)స్పష్టం చేశారు.

పుణేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ శనివారం జరిగిన 137వ పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌( 137th course at National Defence Academy )లో ఆయన మాట్లాడుతూ..‘ సంప్రదాయ యుద్ధమైనా, పరిమిత యుద్ధమైనాసరే తాను భారత్‌పై గెలవలేనని పాకిస్తాన్‌కు 1848 నుంచే తెలుసని, 1965, 1971, 1999ల్లోనూ ఈ విషయం నిరూపణ అయ్యింది’ అని అన్నారు. ఇందులో భాగంగానే పాకిస్థాన్‌ ఉగ్రవాదం రూపంలో పరోక్ష యుద్ధ మార్గాన్ని ఎన్నుకుంది. కానీ ఇందులోనూ ఆ దేశానికి దక్కేది ఓటమే’ అని చెప్పారు.

భారత్‌ ఎల్లప్పుడు ఇతర దేశాలతో సౌహార్దపూర్వక, స్నేహపూరిత సంబంధాలను కోరుకుందని, పరాయి భూభాగాన్ని ఆక్రమించాలన్న ఆలోచన భారత్‌కు లేదని, కానీ రెచ్చగొడితే ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంతోపాటు ప్రపంచం ఇప్పుడు తమ సిద్ధాంతాల ప్రచారానికి ద్వేషాన్ని వ్యాప్తి చేసే సైబర్‌ యుద్ధ రీతులను ఎదుర్కోవాల్సి ఉందని రాజ్‌నాథ్‌ చెప్పారు. శాంతి పరిరక్షణ, మానవతా కార్యక్రమాల్లో భారత సైన్యం ఎంత నైపుణ్యంతో పనిచేస్తుందో ఇప్పుడు అందరికీ తెలుసునని మంత్రి పేర్కొన్నారు.