 
                                                                 New Delhi, Jan 16: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిక్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్(Bhagwant Mann), డీజీపీ గౌరవ్ యాదవ్‌లను హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు.
జనవరి 26న భగవంత్ మాన్‌పై గ్యాంగ్‌స్టర్లు ఏకమై దాడికి (Death threats) దిగాలని పన్నూ కోరారు.. గణతంత్ర దినోత్సవం(Republic Day) రోజున సీఎంపై దాడి చేసేందుకు గ్యాంగ్‌స్టర్లు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చాడు. గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మాన్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి.
కృష్ణ జన్మభూమి కేసులో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు
సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్‌పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్ బాంబు షెల్స్‌తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
