New Delhi, March 22: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol and Diesel Prices in India) మరోసారి భారీగా పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన పన్నెండు రోజుల తర్వాత మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నవంబర్ 2 తరువాత పెట్రోల్, డీజీల్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. లీటర్ పెట్రోల్‌పై 80 పైసలు, డీజిల్‌పై 80 పైసలు (Fuel Prices Hiked by 80 Paise A Litre Each) పెంచారు. కాగా పెరిగిన ధరలు నేటి(మార్చి 22) నుంచే అమల్లోకి రానున్నాయి.
ముంబైలో డీజిల్ ధర లీటరుకు రూ. 94.14 నుంచి రూ. 106.62కి పెరిగి మూడు అంకెల మార్కును తాకింది. అంటే డీజిల్ లీటరు ధర లీటరుకు రూ.12 పెరిగింది.పెట్రోలు ధరలు కూడా లీటరుకు రూ.109.98 నుంచి రూ.115.85కి అనూహ్యంగా పెరిగాయి.గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ నవంబర్ 2021 నుంచి ఇంధన ధరలు మారలేదు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు పెరుగుతాయని అంచనా వేశారు.
వినియోగదారులకు షాక్.. దేశంలో మళ్లీ ఎల్‌పీజీ సిలిండర్ ధర పెంపు, సిలిండర్‌కు రూ.50 చొప్పున పెంపు
ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.110.82 కాగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.95.00కు పెరిగాయి. కేవలం ఒక్క రోజులో రూ. 6 తేడాతో పెట్రోలు ధర భారీగా పెరిగింది. డీజిల్ ధర కూడా లీటరుకు 5 రూపాయలకు పైగా పెరిగింది.తమిళనాడులోని చెన్నైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా లీటరుకు రూ.102.16, రూ.92.19కి పెరిగాయి.విలువ ఆధారిత పన్ను (వ్యాట్), సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలు,నగరాల్లో కూడా మారుతూ ఉంటాయి.