Petrol Price In India | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, May 23: ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Petrol and Diesel Prices in India) రికార్డు స్థాయికి చేరగా.. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరోసారి పెంచాయి. శనివారం ఊరట ఇచ్చినట్లే ఇచ్చి.. ఆదివారం స్వల్ఫంగా (Fuel Prices Hiked Again) పెంచాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై పదిహేడు పైసలు, డీజిల్‌పై 29పైసలు పెరిగాయి. ఈ నెలలో ఫ్యూయల్‌ ధరలు పెరగడం ఇది పన్నెండోసారి. తాజా ధరలతో ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ వందకు దగ్గరైంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.49పైసలకు, డీజిల్‌ ధర రూ.91.30 పైసలకి చేరుకుంది.

చెన్నైలో పెట్రోల్‌ రూ.94.86 డీజిల్‌ రూ.88.87, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.93.27, డీజిల్‌ రూ.86.91, హైదరాబాద్‌లో రూ.96.88, డీజిల్‌ రూ.91.65, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.99.68, డీజిల్‌ రూ.92.78కు చేరాయి. మే నెలలో ఇప్పటి వరకు 12 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.81, డీజిల్‌పై రూ.3.34 పెంచాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది.

యువకుడి చెంప చెల్లుమనిపించిన కలెక్టర్ రణబీర్ శర్మ, తరువాత క్షమాపణ కోరుతూ వీడియో విడుదల, ఘటనను ఖండించిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, కలెక్టర్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు

ప్రధాన నగరాల వారీగా చూస్తే.. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.93.27, డీజిల్‌ రూ.86.91, చెన్నైలో పెట్రోల్‌ రూ.94.86, డీజిల్‌ రూ.88.87, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.96.88, డీజిల్‌ రూ.91.65, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.99.68, డీజిల్‌ రూ.91.65, బెంగళూరులో పెట్రోల్‌ రూ.96.31, డీజిల్‌ రూ.89.12, తిరువనంతపురం పెట్రోల్‌ రూ.95.19, డీజిల్‌ రూ.90.36గా ధరలు ఉన్నాయి.

వ్యాట్‌ తదితర కారణాల వల్ల రాష్ట్రాల మధ్య ఫ్యూయల్‌ ధరల్లో తేడాలు ఉండే విషయం ఉంటుందన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని కొన్ని నగరాల్లో ఇప్పటికే పెట్రోల్‌ లీటర్‌ వంద దాటింది. ఇక రాజస్థాన్‌ చమురు ఆయిల్స్‌పై అత్యధికంగా వ్యాట్‌ విధిస్తోంది.