Representational Image | (Photo Credits: PTI)

New Delhi, June 1: పలు రాష్ట్రాల్లో సెంచరీ దాటి పరుగులు పెడుతున్న ఇంధన ధరలను (Petrol and diesel rates)వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. చమురు కంపెనీలు వినియోగదారులను బాదేస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. మంగళవారం పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్ 23 పైసలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో ( Petrol and diesel price) దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.49, లీటర్‌ డీజిల్‌ రూ.85.38కు చేరింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101కి చేరువైంది. అటు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.52కు చేరగా, డీజిల్ ధర లీటరుకు ధర రూ.98.32 పలుకుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి ఇంధన ధరలు చేరాయి. మరో వైపు హైదరాబాద్‌లో ధర రూ.100కు చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్‌ రూ.98.20.. డీజిల్‌ రూ.93.08కు పెరిగాయి.

మద్యం ప్రియులకు పండగ..ఇకపై నేరుగా ఇంటికే, మ‌ద్యం హోం డెలివ‌రీకి గ్రీన్ సిగ్న‌ల్‌ ఇచ్చిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, ఎల్-13 లైసెన్సు ఉన్న మద్యం అమ్మకందారులకు మాత్రమే పర్మిషన్

మేలో పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు 17వ సారి ధరలు పైకి కదిలాయి. ఇక ముడి చమురు ధరలు సోమవారం పెరగ్గా బ్యారెల్‌ 70 డాలర్లకు.. బ్రెంట్ 0.5 శాతం పెరిగి బ్యారెల్ 69.79 డాలర్లకు చేరింది.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు

ముంబైలో పెట్రోల్‌ రూ.100.47.. డీజిల్‌ రూ.92.69

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.94.49.. డీజిల్‌ రూ.85.38

చెన్నైలో పెట్రోల్ రూ.95.99.. డీజిల్ రూ.90.12

కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.50.. డీజిల్ రూ.88.23

బెంగళూరులో పెట్రోల్ రూ.97.64.. డీజిల్ రూ.90.51

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.91.48.. డీజిల్ రూ.91.93

భోపా‌‌ల్‌లో పెట్రోల్ రూ.102.61.. డీజిల్‌ రూ.93.89

జైపూర్‌లో పెట్రోల్ రూ.101.02.. డీజిల్ రూ.94.19

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.98.20.. డీజిల్‌ రూ.93.08

అమరావతిలో పెట్రోలు రూ. 100.72, డీజిల్‌ రూ. 94.99

వైజాగ్‌లో పెట్రోలు రూ. 99.42, డీజిల్‌ రూ. 93.73