Liquor Shop | File Image | (Photo Credits: ANI)

New Delhi, June 1: కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మద్యాన్ని హోం డెలివరీ చేయాలని (Liquor Home Delivery) ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ సాయంతో మద్యం ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తే చాలు హోం డెలివరీ చేసేందుకు అనుమతిస్తూ ఢిల్లీ సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. మద్యం ప్రియుల ఇళ్ల వద్దకే మద్యాన్ని డెలివరీ చేసేందుకు (Delhi Alcohol Home Delivery) మద్యం వ్యాపారులకు సర్కారు అనుమతించింది.

కాగా ఢిల్లీలో వైరస్‌ వ్యాప్తి కట్టడి చేయడంతో మే 31 నుంచి దశల వారీగా అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభిమైన విషయం తెలిసిందే. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మద్యం హోం డెలివరీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసినవారికి హోం డెలివరీ సదుపాయం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీ కొత్త ఎక్సైజ్‌ చట్టం-2021 ప్రకారం మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసినవారికి మద్యం షాపులు హోం డెలివరీ (Alcohol Home Delivery in Delhi) చేయనున్నారు. అయితే పాత ఎక్సైజ్‌ చట్టం నిబంధనల ప్రకారం.. ఎల్-13 లైసెన్స్ ఉన్న మద్య షాపులు మాత్రమే ఇ-మెయిల్, ఫ్యాక్స్ ద్వారా లిక్కర్‌ ఆర్డర్ వస్తే హోం డెలివరీలను నిర్వహించేవి. అయితే ప్రస్తుతం ఎల్-14 లైసెన్స్ ఉన్న మద్యం అమ్మకందారులకు మాత్రమే ఇంటి మద్యం పంపిణీ చేయబడుతుంది. ఇక ఢిల్లీలో మద్యం కోసం జనాలు క్యూలైన్లలో బారులు తీరిన విషయం తెలిసిందే. ఢిల్లీ లాక్‌డౌన్‌ సమయంలో సుప్రీం కోర్టు సైతం మద్యం హోం డెలివరీని సూచించిన విషయం తెలిసిందే.

తాగిన మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి కరెంట్ తీగలు పట్టుకున్నాడు, ఒక్కసారిగా షాక్ కొట్టడంతో పైనుంచి రోడ్డు మీద పడి అక్కడికక్కడే మృతి, సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన

ఢిల్లీ అబ్కారీ శాక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మ‌ద్యాన్ని హోం డెలివ‌రీ చేయ‌వ‌చ్చు. కానీ క‌చ్చితంగా ఆర్డ‌ర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్ట‌ల్ ద్వారా జ‌ర‌గాల్సిందే. అయితే హాస్ట‌ళ్లు, ఆఫీసులు, సంస్థ‌ల‌కు మాత్రం మ‌ద్యం హోం డెలివ‌రీ ఉండ‌ద‌న్నారు. ఎల్-13 లైసెన్సు లేని వారు మ‌ద్యం హోం డెలివ‌రీ చేయ‌రాదు.ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోనూ మద్య హోండెలివరీకి ప్రభుత్వం అంగీకరించింది.