మైనర్ బాధితురాలి సమ్మతితోనే జరిగినప్పటికీ మైనర్‌తో శారీరక సంబంధాన్ని కొనసాగించడం అత్యాచార నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. 14 ఏళ్ల బాలిక గర్భం ధరించడానికి కారణమైన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్ జడ్జి అమిత్ సహ్రావత్ ఈ విషయం తెలిపారు. 2015 జనవరిలో నమోదైన ఈ కేసు విచారణ ముగింపు దశకు వచ్చింది. బాలికకు జన్మించిన బిడ్డకు తండ్రి నిందితుడేనని డీఎన్‌ఏ పరీక్షల్లో తేలింది. బాలిక లోదుస్తులు తొలగించి వివస్త్రను చేసినంత మాత్రాన రేప్‌గా పరిగణించలేం, రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఇంకా ఏమన్నదంటే..
ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికలో నిందితుడు బాధితురాలితో శారీరక సంబంధాలు ఏర్పరుచుకున్నాడని, దాని పర్యవసానంగా బాధితురాలు గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిందనే ప్రాసిక్యూషన్ కేసును బలపరిచింది.ప్రాసిక్యూషన్ తన కేసును సహేతుకమైన సందేహానికి అతీతంగా నిరూపించిందని పేర్కొంది. దీని ప్రకారం, నిందితుడు అత్యాచారం మరియు తీవ్రమైన లైంగిక వేధింపుల నేరంలో దోషిగా నిర్ధారించబడ్డాడు" అని కోర్టు పేర్కొంది. ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉంది.