PM Kisan Installment Date (photo-Wikimedia commons)

PM Kisan Samman Nidhi 17th installment: పీఎం కిసాన్ నిధి కార్యక్రమం 17వ విడత మొత్తాన్ని విడుదల చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదం తెలిపారు . 9.3 కోట్ల మంది రైతులకు చేరువయ్యే దాదాపు రూ. 20,000 కోట్ల పిఎం కిసాన్ ప్రయోజనం యొక్క 17వ విడత విడుదలకు ప్రధాన మంత్రి అధికారం ఇచ్చారు . సోమవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పీఎం కిసాన్‌ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపై సంతకం చేశారు.

కిసాన్ కళ్యాణ్‌కు పూర్తి కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది అని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ఫైల్ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితం. రాబోయే కాలంలో రైతులు మరియు వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని మేము కోరుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు.  ఒక్క ముస్లీం కూడా లేకుండా మోదీ క్యాబినెట్ ఇదిగో, ఏడుగురు మాజీ సీఎంలతో పాటు 7 గురు మహిళలకు అవకాశం, నరేంద్ర మోదీ క్యాబినెట్ పూర్తి లిస్ట్ ఇదే..

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని అన్ని రకాల భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల ఇన్‌పుట్‌లతో పాటు నివాస అవసరాల కోసం ఆర్థిక అవసరాల కోసం ఆదాయ సహాయాన్ని అందిస్తుంది. పెట్టుబడి సాయం కింద మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున ఏటా కేంద్రం ఈ పథకం కింద రూ.6 వేలు అందిస్తోంది. ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేసింది. 17వ విడతగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి మొత్తాలు త్వరలో బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఆ వివరాలు తెలుసుకోవచ్చు.

పేమెంట్‌ స్టేటస్ తెలుసుకోవడం ఎలా

పీఎం కిసాన్‌ (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి.. అందులో బెనిఫిషియరీ స్టేటస్‌ పేజీపై క్లిక్‌ చేయాలి.

ప్రత్యేకంగా ఓపెన్‌ అయ్యే పేజీలో ఆధార్‌ లేదా అకౌంట్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.

గెట్‌ డేటా బటన్‌పై క్లిక్‌ చేయగానే పేమెంట్‌ వివరాలు కనిపిస్తాయి.

ఒకవేళ కేవైసీ చేయకపోతే నిధులు జమ కావు.

కాబట్టి ఒకవేళ కేవైసీ పూర్తి చేయకుంటే అదే వెబ్‌సైట్‌లో ఇ-కేవైసీ బటన్‌ను క్లిక్‌ చేసి ప్రక్రియను పూర్తి చేయాల్సిఉంటుంది.