PM-KISAN Scheme: రేపే రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు, పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు విడుదల చేయనున్న కేంద్రం, పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన జాబితాలో ల‌బ్దిదారుల పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా..
Representational Image (Photo Credits: IANS)

New Delhi, August 8: ఆగస్టు 9న పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు (Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) విడుద‌ల కానున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద అర్హులైన దేశ‌వ్యాప్త రైతుల‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి వారి ఖాతాల్లో న‌గ‌దు జ‌మ కానుంది. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని మోదీ (PM Narendra Modi) ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. దేశ‌వ్యాప్తంగా 9.75 కోట్ల రైతుల ఖాతాల‌కు రూ.19,500 కోట్లు బ‌దిలీ కానున్నాయి. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌ధాని జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద, సంవత్సరానికి 6000/- రూపాయల ఆర్థిక ప్రయోజనం అర్హత కలిగిన లబ్ధిదారు రైతు కుటుంబాలకు అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమానమైన వాయిదాలలో అంటే నాలుగు నెలలకు ఓసారి 2000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ ప‌థ‌కం కింద ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు రూ.1.38 ల‌క్ష‌ల కోట్ల‌ను వెచ్చించింది. 8వ విడ‌త ఇన్‌స్టాల్‌మెంట్ గ‌డిచిన మే నెల 14వ తేదీన విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

టీకా తీసుకున్నా..అమెరికాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్, వేగంగా పెరుగుతున్న కేసులు, బ్రిటన్‌లో టీకా తీసుకున్న వారికి సోకుతున్న ప్రమాదకర డెల్టా వేరియంట్‌, దేశంలో తాజాగా 39,070 కరోనా కేసులు నమోదు

పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన జాబితాలో ల‌బ్దిదారుల పేరు ఉందో లేదో ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవ‌చ్చు.

ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి: లింక్ ఇదే .. https://pmkisan.gov.in/

కుడి వైపున ‘ఫార్మర్స్ కార్నర్’ ఎంపిక చేసుకోవాలి

తరువాత ‘లబ్ధిదారుల జాబితా’ ఎంపికపై క్లిక్ చేయాలి

కొత్త పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామ వివరాలను ఫిల్ చేయాలి. అలాగే ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్ అడిగితే ఎంటర్ చేయండి

తరువాత గెట్ రిపోర్ట్‌ బటన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు వివరాలు కనిపిస్తాయి. లేకుంటే పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్ లింక్ మీద నేరుగా క్లిక్ చేయండి

వ‌చ్చిన‌ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ప‌రిశీలించుకోవ‌చ్చు.