PM Modi in Special Parliament Session (Photo-ANI)

New Delhi, Sep 18: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ "... నేను ఎంపీగా తొలిసారి ఈ భవనం (పార్లమెంట్)లోకి ప్రవేశించినప్పుడు, నేను ప్రజాస్వామ్య దేవాలయానికి నమస్కరించి, గౌరవించాను. ఇది నాకు భావోద్వేగ క్షణం. నేను ఎన్నడూ ఊహించలేకపోయాను. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నివసించే నిరుపేద కుటుంబం నుంచి వచ్చి పార్లమెంటులో అడుగుపెట్టగలనని.. ప్రజల నుంచి ఇంత ప్రేమను పొందుతానని నేను ఊహించలేదు.

పార్లమెంట్‌లోకి వెళ్తే గుడిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ప్రజాస్వామ్యానికి జీవాత్మలాంటిదైన పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని భారత్‌ ఎప్పటికీ మరిచిపోదు. ఉగ్రదాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించిన సైనికులకు సెల్యూట్‌. ఇంద్రజిత్‌ గుప్తా 43 ఏళ్లు ఈ భవనంలో సేవలందించారు. దళితులు, ఆదివాసీ, మధ్య తరగతి మహిళలకు ఈ సభ అవకాశమిచ్చిందని అన్నారు.

చంద్రయాన్-3 విజయంతో ప్రపంచం నలుమూలలా భారత జాతీయ పతాకం రెపరెపలాడుతోంది, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఈ భవనానికి వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురిచేస్తోంది. పాత పార్లమెంట్‌తో ఎంతో అనుబంధం ఉంది. పార్లమెంట్‌లో తొలిరోజు నేను భావోద్వేగానికి గురయ్యాను. ప్రజల సందర్శనకు పాత పార్లమెంట్‌ భవన్‌ తెరిచే ఉంటుంది. ప్రారంభంలో మహిళా ఎంపీల సంఖ్య తక్కువగా ఉండేది. క్రమంగా వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.

Here's ANI Video

చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. చారిత్రక పార్లమెంట్‌ భవనానికి వీడ్కోలు పలుకుతున్నాం. ఈ 75 ఏళ్ల ప్రయాణం ఎంతో గర్వకారణమైంది. ఈ ప్రయాణంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. భారతీయులు స్వేదం, డబ్బుతో ఈ భవనాన్ని నిర్మించాం. ఈ పార్లమెంట్‌ భవనం మనల్ని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. మనం కొత్త భవనంలోకి వెళ్తునప్పటికీ పాత భవనం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. చంద్రయాన్‌-3 విజయం దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తుంది. ఇది మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి ప్రతీక. చంద్రయాన్‌-3 విజయంతో మన సత్తా చాటాం. భారత్‌ అభివృద్ధి ప్రపంచమంతా ప్రకాశిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.