PM Modi In Jammu Kashmir: ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటన ప్రారంభం..ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి పర్యటన ఇదే, 20 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..
Narendra Modi (Photo Credits: ANI)

Jammu Kashmir, April 24: ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జమ్మూకశ్మీర్ లో పర్యటించారు. సాంబా జిల్లాలో పర్యటించిన ప్రధాని.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఢిల్లీ–అమృత్ సర్–కాత్రా ఎక్స్ ప్రెస్ వేకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లీ గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ను, 8.45 కిలోమీటర్ల పొడవున రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్–ఖాజీగంద్ రోడ్డు సొరంగాన్ని ప్రారంభించారు. చినాబ్ నదిపై 850 మెగావాట్ల రాటిల్ జలవిద్యుత్ కేంద్రం, 540 మెగావాట్ల క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు భారీ జలవిద్యుత్ కేంద్రాలను కిష్వార్ జిల్లాలో నిర్మించనున్నారు.

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం పల్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, అందులో భాగంగా నేడు రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు చెప్పారు. పల్లీ గ్రామం దేశంలోనే తొలి కర్బన ఉద్గారాల్లేని పంచాయతీగా నిలిచిందని మోదీ అన్నారు. ఈ సంవత్సరం పంచాయతీ దినోత్సవాన్ని జమ్మూలో జరుపుకుంటున్నామన్నారు. మూడంచెల పంచాయతీ వ్యవస్థ లేకపోవడం వల్ల జమ్మూ ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, ఎన్నో ఏళ్లుగా జమ్మూకశ్మీర్ ప్రజలకు అమలు కాని రిజర్వేషన్లు ఇప్పుడు అమలవుతున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో యువతి నోట్లో గుడ్డలు కుక్కి ముగ్గురు గ్యాంగ్‌ రేప్, లైంగిక బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ సీఎం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

జమ్మూ యువత.. తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలను ఇప్పుడు ఎదుర్కోబోదన్నారు. సర్వకాలసర్వావస్థల్లో మిగతా దేశంతో జమ్మూకశ్మీర్ ను అనుసంధానించేలా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. జమ్మూలో నీటి సమస్య తొలగించేందుకు పంచాయతీల్లో మహిళలను భాగస్వాములను చేశామన్నారు. అలాగే.. రైతులు సేంద్రీయ వ్యవసాయంపై మొగ్గు చూపేలా పంచాయతీలు ప్రోత్సహించాలని ప్రధాని మోదీ సూచించారు. పంచాయతీ అయినా.. పార్లమెంట్ అయినా.. చేసే పని చిన్నది కాదన్నారు.