New Delhi, OCT 05: నిజామాబాద్ లో పసుపు బోర్డు (Turmeric Board) ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పసుపు బోర్డుతో రైతులకు మేలు జరుగుతుందని ఆయన తెలుగులో ట్వీట్ (PM MODI) చేశారు. పసుపుబోర్డు ఏర్పాటుపై తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు."శ్రమించే కోట్లాది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తీసుకున్న చాలా ముఖ్యమైన కేబినెట్ నిర్ణయం ఇది.రైతులకు మెరుగైన మార్కెట్లు, మరింత లాభాలు ఖచ్చితంగా లభించేందుకు జాతీయ పసుపు బోర్డు (Turmeric Board) తోడ్పడుతుంది." అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పసుపుబోర్డుపై చేసిన ప్రకటనను జోడించారు.
శ్రమించే కోట్లాది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తీసుకున్న చాలా ముఖ్యమైన కేబినెట్ నిర్ణయం ఇది.రైతులకు మెరుగైన మార్కెట్లు, మరింత లాభాలు ఖచ్చితంగా లభించేందుకు జాతీయ పసుపు బోర్డు తోడ్పడుతుంది. https://t.co/VFAwLXGmhI
— Narendra Modi (@narendramodi) October 5, 2023
ఇప్పటికే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పసుపు బోర్డుతో పాటూ సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీని కూడా మంజూరు చేసింది కేబినెట్. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. తొమ్మిదేళ్లుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ఇప్పుడు ఎన్నికల కోసం బీజేపీ డ్రామాలు చేస్తోందని విమర్శిస్తున్నారు.