PM Modi's Kedarnath Visit (Photo-ANI)

Kedarnath, Nov 5: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేదార్‌నాథ్‌లో (PM Modi's Kedarnath Visit) పర్యటించారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.కేదార్‌నాథ్ ఆలయం శివునికి అంకితం చేశారు. ప్రార్థనల అనంతరం.. 2013లో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న.. శ్రీ ఆదిశంకరాచార్య (Adi Guru Shankaracharya) సమాధిని ప్రధాని పునఃప్రారంభించారు. ఆ వెంటనే శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని (Adi Guru Shankaracharya Statue) ప్రధాని మోదీ ఆవిష్కరించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

కొత్తగా నిర్మించిన ఆది శంకరాచార్యుల సమాధి, విగ్రహంతోపాటు సరస్వతి ఘాట్, 130 కోట్ల ఇన్‌ ఫ్రా ప్రాజెక్టులను (PM Narendra Modi Inaugurates Re-Development Projects) ప్రధాని మోదీ.. ఉ‍త్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామితో కలిసి ప్రారంభించారు. వీటిలో సరస్వతి రిటైనింగ్ వాల్, ఘాట్‌లు, మందాకిని రిటైనింగ్ వాల్, తీర్థ పురోహిత్ హౌస్‌లు, మందాకిని నదిపై గరుడ్ చట్టి వంతెనలు ఉన్నాయి. కాగా, ప్రధాని కేదార్‌నాథ్‌ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్‌నాథ్ ఆలయం నాలుగు పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దీనిని చార్ ధామ్ యాత్ర అని పిలుస్తారు. ఇందులో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి.

దేశంలో గడిచిన 24గంటల్లో 12,885 మందికి కరోనా, తాజాగా 15,054 మంది బాధితులు కోలుకోని డిశ్చార్జ్

డెహ్రాడూన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ (రిటైర్డ్), సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు. పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ పర్యటించడం విశేషం.ప్రధాని తన పదవీ కాలంలో ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. మోదీ గతంలో చివరిసారిగా 2019లో కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు.

PM Modi Kedarnath Visit Visuals 

2019లో ఆదిగురు శంకరాచార్య  విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఆది గురు శంకరాచార్య విగ్రహం 2  ఫీట్ల పొడవు, బరువు 35,000 కిలోలు. దీనిని మైసూర్‌కు చెందిన శిల్పులు క్లోరైట్ స్కిస్ట్‌తో తయారు చేశారు. భీకర వర్షాలు, ఎండలతో పాటు ఎలాంటి ప్రకృతి వైపరిత్యం తలెత్తినా తట్టుకునేలా దీనిని నిర్మించారు. మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.

ఆదిశంక‌రాచార్య విగ్ర‌హాన్ని ప్ర‌ధాని మోదీ ఆవిష్క‌రించిన త‌ర్వాత ఆయ‌న మాట్లాడుతూ.. ఆదిశంక‌రాచార్య విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని దేశ‌వ్యాప్తంగా అంద‌రూ తిల‌కించార‌న్నారు. శంక‌రాచార్య భ‌క్తులు ఈ పుణ్య స్థ‌లంలో ఆత్మ స్వ‌రూపంలో హాజ‌రైయ్యార‌న్నారు. దేశంలో ఉన్న అన్ని మ‌ఠాలు, జ్యోతిర్లింగ్ క్షేత్రాలు.. కేదార్‌నాథ్‌లో జ‌రుగుతున్న శంక‌రాచార్య విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తున్న‌ట్లు మోదీ తెలిపారు.