Varanasi December 16: ఇటీవల వారణాసి(Modi Varanasi tour)లో పర్యటించిన ప్రధాని మోదీ(Narendra modi)కి సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌(Viral on social media)గా మారింది. ఒక దివ్యాంగ మహిళకు ప్రధాని పాదాభివందనం చేసిన ఫోటో వేలల్లో షేర్ అవుతోంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తోంది .ఇటీవల వారాణసికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ(Pm Narendra Modi)... తనను కలిసేందుకు వచ్చిన ఓ దివ్యాంగ మహిళ పాదాలను తాకి( touches feet of differently abled women feet) కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్(Vanathi Sreenivasan) ఈ చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. మహిళా శక్తికి గౌరవం అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ఇది మొత్తం మహిళా శక్తికి దక్కిన గౌరవం. మన ప్రధాని నరేంద్ర మోదీని చూసి మనమంతా గర్విస్తున్నాం’’ అని వనతీ శ్రీనివాసన్ ట్వీట్ చేశారు.

వారాణసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌(Kashi Vishwanath Corridor project )ను ప్రధాని మోదీ ప్రారంభించిన కొద్దిసేపటికే శిఖా రస్తోగి(Shikha Rastogi) అనే దివ్యాంగ మహిళ(divyang woman) వచ్చారు. మహిళను చూడగానే, ప్రధాని మోదీ ఆమె క్షేమ సమాచారాల గురించి అడిగారు. దివ్యాంగ మహిళ(divyang woman) ప్రధాన మంత్రి ఆశీర్వాదం తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు, ప్రధాని ఆమెను ఆపి, బదులుగా దివ్యాంగ మహిళకు పాదాభివందనం చేశారు. ప్రధాని స్పందన శిఖా రస్తోగి(Shikha Rastogi)ను ఆకట్టుకుంది. దాంతో ఆమె ముకుళిత హస్తాలతో నిలబడి ప్రధానికి తన కృతజ్ఞతలు తెలిపారు. ఇది జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ముందుకు వచ్చి శిఖా రస్తోగి(Shikha Rastogi)ని పలకరించారు.

Kashi Vishwanath Corridor: కాశీలో ప్ర‌తి రాయి శివుడే.. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ, అంద‌రికీ కాశీ విశ్వ‌నాథుడి ఆశీస్సులు ఉండాలన్న భారత ప్రధాని

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన భద్రతా సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రధానమంత్రి మహిళ పాదాలను తాకిన ఫొటో కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. ఈ చిత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో విస్తృతంగా షేర్ చేశారు.