New Delhi December09: హెలికాప్టర్ ప్రమాదం (Helecopter crash)లో మరణించిన సీడీఎస్‌ బిపిన్ రావత్(Bipin Rawat), ఆయన సతీమణి మధులిక రావత్(Madhulika Rwat), ఇతర ఆర్మీ అధికారుల భౌతిక కాయాలు పాలం ఎయిర్ బేస్‌(Palam Airbase)కు చేరుకున్నాయి. ప్రత్యేక విమానంలో సూలూరు ఎయిర్ బేస్(Suluru Airbase) నుంచి వారి పార్ధీవదేహాలను తీసుకువచ్చారు. రాత్రి 8.45 గంటల ప్రాంతంలో పాలం ఎయిర్ పోర్టుకు చేరుకున్న భౌతిక కాయాలకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

సీడీఎస్ బిపిన్ రావ‌త్, ఆయ‌న భార్య‌, ఇత‌ర ఆర్మీ సిబ్బంది భౌతిక‌కాయాల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(Pm Narendra Modi Pays Tribute) నివాళుల‌ర్పించారు. ఆ త‌ర్వాత ఆర్మీ కుటుంబ స‌భ్యుల‌తో పాలం ఏయిర్‌పోర్టులో మాట్లాడారు. కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌(Rajnath Singh), జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్(Ajith Doval), త్రివిధ ద‌ళాల అధిప‌తులు కూడా వారి భౌతిక‌కాయాల‌కు నివాళుల‌ర్పించారు. రాజ్‌నాథ్‌, దోవ‌ల్‌ ఆర్మీ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు.

హెలికాప్ట‌ర్ దుర్ఘ‌ట‌న‌లో దుర్మ‌ర‌ణం పాలైన వారి కుటుంబ సభ్యులు పాలం ఎయిర్ బేస్‌లో వారి భౌతిక కాయాల వద్ద రోదించారు. అయితే బిపిన్ రావత్, ఆయన సతీమణి భౌతిక కాయాలను గుర్తించిన అధికారులు, మిగిలిన వారి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.

శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని స్మశానవాటికలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలను(Bipin Rawat Last Rites) అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్(Ramnath Kovind), ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu), ప్రధాని మోడీ, రక్షణమంత్రి రాజ్‌ నాథ్, పలువురు కేంద్ర మంత్రులతో పాటూ, త్రివిధ దళాల అధిపతులు, పలు దేశాలకు చెందిన ఆర్మీ అధికారులు, భారత త్రివిద దళాలకు చెందిన ముఖ్య అధికారులు బిపిన్ రావత్ దంపతులకు శుక్రవారం రోజు నివాళులు అర్పించనున్నారు.

IAF Chopper Crash: ప్రమాదం తర్వాత బిపిన్ రావత్ కొంతసేపు బతికే ఉన్నారు, మమ్మల్ని మంచి నీళ్లు కావాలని అడిగారు, కాని కొద్ది సేపటికే...ప్రమాద ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు