IAF helicopter crashed near Coonoor with CDS Gen Bipin Rawat onboard (Photo Ctredits: PTI/ANI)

Coonoor, Dec 9: తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో నిన్న చోటుచేసుకున్నఘోర హెలికాప్టర్ ప్రమాదంలో (IAF Chopper Crash) భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణితో పాటు మరో 11 మంది దుర్మరణం పాలయ్యారు. నీలగిరి కొండల్లోని కూనూర్ వద్ద సంభవించిన ఈ ప్రమాదంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని విషయాలను వెల్లడిస్తున్నారు.

హెలికాప్టర్‌ ప్రమాదం తర్వాత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కొంతసేపు ప్రాణాలతో ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తి తనను మంచినీళ్లు (He Asked For Water) కావాలని అడిగారని, అయితే ఆయనే రావత్‌ (Eyewitness Claims He Saw General Bipin Rawat)అనే విషయం తనకు తర్వాత తెలిసిందని చెప్పారు. ఎన్టీటీవి కథనం ప్రకారం..శివకుమార్ అనే వ్యక్తి అక్కడి టీ ఎస్టేట్ లో పని చేస్తున్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది. ఆకాశంలో హెలికాప్టర్ మండిపోతూ పడిపోతుండటాన్ని నేను చూశాను. హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే నేను, మరి కొందరు ఆ ప్రాంతానికి పరుగులు పెట్టాము. మూడు శరీరాలు పడిపోవడాన్ని మేము చూశాం.

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై రాజ్‌నాథ్ సింగ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌, 12.08 నిమిషాల‌కు ఏటీసీతో హెలికాప్ట‌ర్ సంబంధాలు కట్, ఘ‌ట‌న‌పై ట్రై స‌ర్వీస్‌ ఎంక్వైరీకి ఆదేశించిన‌ట్లు తెలిపిన రక్షణ మంత్రి

వారిలో ఒకరు ప్రాణాలతో ఉన్నారు. ఆయనను మేము బయటకు లాగాము. ఆ సమయంలో ఆయన నీళ్లు కావాలని మమ్మల్ని అడిగారు. ఆయనను బెడ్ షీట్ లో రెస్క్యూ టీమ్ తీసుకెళ్లారు. మేము మాట్లాడిన వ్యక్తి జనరల్ బిపిన్ రావత్ అని మూడు గంటల తర్వాత మాకు ఎవరో చెప్పారు. నాకు ఎంతో బాధ అనిపించింది. దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి చివరకు నీళ్లు కావాలని మమ్మల్ని అడిగారు. అప్పుడు ఆయనకు ఇవ్వడానికి మా దగ్గర నీళ్లు లేవు. నిన్న రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదని ప్రత్యక్ష సాక్షి కన్నీటి పర్యంతమయ్యారు.

బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ సిబ్బంది, హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగిందో విశ్లేషించనున్న ఫోరెన్సిక్, కిలో మీటరు దూరం వరకు గాలించిన సిబ్బంది

రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునే సరికి కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు సీనియర్ ఫైర్‌మ్యాన్‌ ఒకరు తెలిపారు. అందులో ఒకరు సీడీఎస్‌ రావత్‌ అని అన్నారు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రక్షణశాఖ సిబ్బందికి లోగొంతుకతో తన పేరును హిందీలో చెప్పారని తెలిపారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మరణించారని అన్నారు. గాయపడిన మరో వ్యక్తి గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్ అని గుర్తించేందుకు చాలా సమయం పట్టిందన్నారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించడం కోసం బెంగళూరులోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంది.